శర్వానంద్ 'భోగి' వాయిదా.. కొత్త విడుదల తేదీ త్వరలోSharwanand's 'Bhogi' Postponed; New Release Date to Be Announced Soon
నవంబర్ 12న విడుదల కావాల్సిన శర్వానంద్, సంపత్ నంది 'భోగి' వాయిదా పడింది. అనుకోని ఆలస్యం కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నామని, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రకటించింది.Sharwanand and Sampath Nandi's period action drama 'Bhogi', due on November 12, has been postponed. Sri Sathya Sai Arts cited unforeseen delays and said a new date will be announced soon.

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదల వాయిదా పడింది. నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
“‘భోగి’ మా అందరికీ ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ఎంతో ఆశయం, అంకితభావంతో దీన్ని రూపొందించాం. ప్రేక్షకుల అంచనాలకు తగ్గ గుర్తుండిపోయే థియేటర్ అనుభూతిని అందించడమే మొదటి నుంచీ మా లక్ష్యం. అయితే అనుకోని ఆలస్యం కారణంగా ‘భోగి’ వాయిదా పడింది. సినిమా విడుదలపై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని కోరుతున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం” అని నిర్మాణ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. ప్రేక్షకుల ఓపిక, మద్దతు కోరుతూ, “ఈ ఎదురుచూపు వృథా కాదని హామీ ఇస్తున్నాం” అని తెలిపింది.
సెన్సార్ బోర్డు (CBFC) ఎగ్జామినింగ్ కమిటీ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపడం వల్లే విడుదల ఆగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ సహా ప్రచార కార్యక్రమాలను కూడా చిత్రబృందం నిలిపివేసింది. రివైజింగ్ కమిటీ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
1960ల నాటి నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఒక కల్పిత గ్రామంలో సాగే ఈ కథలో శర్వానంద్ ‘గంగ’ అనే పాత్రలో కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, కిషోర్ కుమార్ ఆరోకియా ఛాయాగ్రహణం, కిరణ్ కుమార్ మన్నె ప్రొడక్షన్ డిజైన్ అందించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.
‘Bhogi’, director Sampath Nandi’s period action drama starring Sharwanand, has been postponed. Production house Sri Sathya Sai Arts announced on social media that the film, slated for a worldwide release on November 12, will not arrive as planned.
“Bhogi has been an immensely special project for all of us, made with great ambition, passion and dedication. Right from the beginning, our vision has been to deliver a memorable theatrical experience that truly lives up to the expectations of our audiences. However, due to unforeseen delays, Bhogi stands postponed. We kindly request everyone not to believe or circulate any speculation regarding the film’s release. The new release date will be announced soon,” the statement said. Seeking audiences’ patience and support, the makers added, “We promise to make the wait worthwhile.”
According to trade reports, the delay follows the CBFC’s examining committee referring the film to its revising committee. The team has paused promotions, including the trailer launch and pre-release event, and the revising committee process is expected to take some time.
Set in the 1960s in a fictional village on the Telangana-Maharashtra border, the film stars Sharwanand as Ganga, with Anupama Parameswaran and Dimple Hayathi as the female leads. Bheems Ceciroleo composed the music, Kishore Kumar Arokia handled the cinematography and Kiran Kumar Manne the production design. ‘Bhogi’ is planned as a pan-India release in Telugu, Tamil, Kannada and Malayalam.
సినిమా విభాగంలో మరిన్నిMore in Cinema

'కాక' సీక్రెట్ లీక్ చేసిన చిరు.. అనస్వర రాజన్ పాత్రపై మెగాస్టార్ హింట్!Chiru Leaks Again: Chiranjeevi Drops a Hint About Anaswara Rajan's Role in 'Kaaka'

ఈ వారం థియేటర్లలో: 'ENE రిపీట్', 'ఆకాశంలో ఒక తార', 'ఓం'This Week in Theatres: 'ENE Repeat', 'Aakasamlo Oka Tara' and Dhanush's 'Om'



