కంటెంట్‌కు వెళ్లండిSkip to content
18, నవంబర్ 2026, బుధవారంWednesday, 18 November 2026
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates

'ఇట్లు అర్జున' రిఫ్రెషింగ్ సినిమా.. అనీష్ కళ్లతోనే నటించాడు: చిరంజీవి'Itlu Arjuna' Is a Refreshing Film, Aniesh Acts With His Eyes: Chiranjeevi; Nagarjuna Says 'Aniesh Has Arrived'

అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన 'ఇట్లు అర్జున' సక్సెస్ వేడుకలకు నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి హాజరై టీమ్‌ను అభినందించారు. మూగ పాత్రలో అనీష్ నటనను ఇద్దరూ ప్రత్యేకంగా ప్రశంసించారు.Nagarjuna and Chiranjeevi joined the success celebrations of Aniesh and Anaswara Rajan's 'Itlu Arjuna', both singling out the debutant's performance as a mute hero, as word of mouth and collections keep growing.

Cine Sarkar Desk
Share
'ఇట్లు అర్జున' సక్సెస్ వేడుకలో చిరంజీవి, నాగార్జున, అనీష్, అనస్వర రాజన్
'ఇట్లు అర్జున' సక్సెస్ వేడుకలో చిరంజీవి, నాగార్జున, అనీష్, అనస్వర రాజన్

నాగార్జున సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకీ కుడుముల నిర్మించిన ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న విడుదలై పాజిటివ్ మౌత్ టాక్‌తో దూసుకెళ్తోంది. అనీష్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్. మహేష్ ఉప్పల దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం సక్సెస్ వేడుకలు నిర్వహించింది.

అనీష్‌కు చిరు ప్రశంసలు

తాజాగా జరిగిన సక్సెస్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మంచి కథ, నాగార్జున సహా టీమ్ అందరి సపోర్ట్ దొరకడం అనీష్ అదృష్టమని అన్నారు. ఒక కొత్త హీరోకు ఇంతమంది అండగా నిలవడం సులువు కాదని, ఆ ప్రోత్సాహాన్ని అనీష్ తన కష్టంతో సంపాదించుకున్నాడని చెప్పారు. అనీష్ డ్యాన్సులు, యాక్షన్ సన్నివేశాల్లో బాడీ లాంగ్వేజ్, మూగ పాత్రలో కళ్లతోనే భావాలను పలికించిన తీరును ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ‘ఇట్లు అర్జున’ ఒక రిఫ్రెషింగ్, యూత్‌ఫుల్ సినిమా అని కొనియాడారు. తమన్ సంగీతాన్ని, అనస్వర రాజన్ నటనను, దర్శకుడు మహేష్ ఉప్పల స్క్రిప్ట్, ప్రతి చిన్న విషయంపై ఆయన చూపిన శ్రద్ధను ప్రశంసించారు. ఇదే వేదికపై ’కాక’లో అనస్వర పాత్ర గురించి చిరు ఇచ్చిన హింట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘అనీష్ వచ్చేశాడు’: నాగార్జున

అంతకుముందు నవంబర్ 14న జరిగిన సక్సెస్ మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ, “అనీష్ వచ్చేశాడు, అంతటా అతని గురించే మాట్లాడుకుంటున్నారు. షో షోకూ సినిమా టాక్ పెరుగుతోంది, దాంతోపాటు కలెక్షన్లూ పెరుగుతున్నాయి” అన్నారు. మూగ పాత్ర చేయడం చాలా కష్టమని, తొలి సినిమాతోనే అనీష్ తనను తాను నిరూపించుకున్నాడని ప్రశంసించారు. తమన్‌ను సినిమాకు ’ఫస్ట్ స్టార్’గా అభివర్ణించారు. మూగ హీరో, గలగలా మాట్లాడే హీరోయిన్ పాత్రలను బ్యాలెన్స్ చేసిన దర్శకుడు మహేష్ ఉప్పల రచనను, తెలుగు రాకపోయినా అనస్వర చక్కని డిక్షన్‌ను మెచ్చుకున్నారు.

అందరికీ అనీష్ కృతజ్ఞతలు

కొత్త హీరోను ఆదరించిన ప్రేక్షకులకు అనీష్ కృతజ్ఞతలు తెలిపారు. సినిమాకు అసలైన హీరో సంగీతమేనని అందరూ అంటున్నారని, ఎన్నిసార్లు ట్యూన్లు మార్చమన్నా ఓపికగా పనిచేసిన తమన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. తనను నమ్మిన దర్శకుడు మహేష్ ఉప్పల, నిర్మాత వెంకీ కుడుముల, సపోర్ట్ చేసిన నాగార్జున, ఎన్టీఆర్, రామ్ చరణ్, నానిలకు కృతజ్ఞతలు తెలిపారు. సహాయ దర్శకులందరినీ వేదికపైకి పిలిచి గౌరవించారు. కీర్తి పాత్రలో అనస్వర ఇచ్చిన సలహాలు తాను నటుడిగా ఎదగడానికి ఉపయోగపడ్డాయని చెప్పారు.

‘Itlu Arjuna’, presented by Nagarjuna and produced by Venky Kudumula under What Next Entertainments, released on November 13 and is riding on strong word of mouth. The film launches Aniesh as a hero opposite Anaswara Rajan, with Mahesh Uppala directing and Thaman composing the music. The team has been celebrating the response with success events.

Chiranjeevi praises Aniesh

Chiranjeevi attended the latest celebration as special guest. He said Aniesh was fortunate to have a good story and the backing of Nagarjuna and the whole team, adding that it is not easy for a debutant to win support from so many people and that Aniesh had earned it. He singled out Aniesh’s dancing, his body language in the action scenes and the way he conveys emotion through his eyes while playing a mute character, and called ‘Itlu Arjuna’ a refreshing, youthful film. He also praised Thaman’s music, Anaswara Rajan’s performance, and Mahesh Uppala’s script and eye for detail. The hint he dropped on the same stage about Anaswara’s role in ‘Kaaka’ has since gone viral.

‘Aniesh has arrived’: Nagarjuna

At the earlier success meet on November 14, Nagarjuna said, “Aniesh has landed and he is everywhere. Show by show the talk is growing, and along with it, the collections.” Playing a mute character is very difficult, he said, and Aniesh had proved himself with his first film. He called Thaman the film’s ‘first star’, praised Mahesh Uppala for balancing a mute hero with a heroine who never stops talking, and complimented Anaswara’s Telugu diction despite her not knowing the language.

Aniesh thanks everyone

Aniesh thanked audiences for embracing a newcomer. Everyone who has seen the film says the music is the real hero, he said, and he thanked Thaman for patiently reworking tunes again and again. He thanked director Mahesh Uppala and producer Venky Kudumula for trusting him, and Nagarjuna, Jr NTR, Ram Charan and Nani for their support. He invited all the assistant directors on stage to thank them, and said Anaswara’s suggestions on set helped him grow as a performer.

Share

సినిమా విభాగంలో మరిన్నిMore in Cinema