కంటెంట్‌కు వెళ్లండిSkip to content
18, నవంబర్ 2026, బుధవారంWednesday, 18 November 2026
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates

ఈ వారం థియేటర్లలో: 'ENE రిపీట్', 'ఆకాశంలో ఒక తార', 'ఓం'This Week in Theatres: 'ENE Repeat', 'Aakasamlo Oka Tara' and Dhanush's 'Om'

కల్ట్ క్లాసిక్ 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ENE రిపీట్' నవంబర్ 19న, దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార', ధనుష్ 'ఓం – చాప్టర్ 1' నవంబర్ 20న విడుదలవుతున్నాయి. ఈ వారం థియేటర్లకు వస్తున్న సినిమాల వివరాలు.Tharun Bhascker's 'Ee Nagaraniki Emaindi' sequel 'ENE Repeat' opens on November 19, followed by Dulquer Salmaan's 'Aakasamlo Oka Tara' and Dhanush's 'Om – Chapter 1' on November 20. Here's what's coming to theatres this week.

Cine Sarkar Desk
Share
'ENE రిపీట్' సినిమా పోస్టర్
'ENE రిపీట్' సినిమా పోస్టర్

ఈ వారం తెలుగు ప్రేక్షకుల కోసం థియేటర్లలో మూడు ఆసక్తికరమైన సినిమాలు సిద్ధమయ్యాయి. యూత్ ఫేవరెట్ సీక్వెల్, ఫీల్-గుడ్ డ్రామా, భారీ యాక్షన్ డ్రామా.. ఇలా మూడు భిన్నమైన జానర్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.

ENE రిపీట్ — నవంబర్ 19 (గురువారం)

తరుణ్ భాస్కర్ 2018లో తీసిన కల్ట్ కామెడీ ’ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌గా వస్తున్న ‘ENE రిపీట్’ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి భాగం విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయిన రోజే సీక్వెల్ రావడం విశేషం. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ ఈ గ్యాంగ్‌లో కనిపించనుండగా, మొదటి భాగంలో కార్తీక్ పాత్ర చేసిన సాయి సుశాంత్ రెడ్డి స్థానంలో శ్రీనాథ్ మాగంటి జాయిన్ అయ్యారు. అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించారు. ఇది పూర్తి లాఫ్ రైట్, అందులో భావోద్వేగ క్షణాలూ ఉంటాయని ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్ చెప్పారు. ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

ఆకాశంలో ఒక తార — నవంబర్ 20 (శుక్రవారం)

దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో స్వప్న సినిమాస్ నిర్మించిన ‘ఆకాశంలో ఒక తార’ శుక్రవారం విడుదల కానుంది. సాత్విక వీరవల్లి హీరోయిన్ కాగా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా యు/ఏ సర్టిఫికెట్ పొందింది. మహిళా సాధికారత, భార్యాభర్తల అనుబంధం, కలలను హద్దులు లేకుండా సాధించవచ్చన్న సందేశాన్ని దర్శకుడు చక్కగా చూపించారని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్టు సమాచారం. సినిమా నిడివి సుమారు 2 గంటల 36 నిమిషాలు.

ఓం – చాప్టర్ 1 — నవంబర్ 20 (శుక్రవారం)

‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం – చాప్టర్ 1’ కూడా శుక్రవారమే తెలుగులో విడుదలవుతోంది. నిజ ఘటనల స్ఫూర్తితో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ యాక్షన్ డ్రామా రూపొందింది. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు చేపట్టే ఆపరేషన్ పేరే ‘OM’ (ఆపరేషన్ మోల్). ఐపీఎస్ అధికారి నిత్య రెడ్డిగా సాయి పల్లవి నటించగా, ట్రైలర్‌ను బట్టి మమ్ముట్టి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. శ్రీలీల మరో కీలక పాత్రలో నటించారు. సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ’అమరన్’ను తెలుగు ప్రేక్షకులు ఆదరించడంతో ఈ సినిమాపైనా మంచి అంచనాలున్నాయి.

వచ్చే వారం: నవంబర్ 27న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’, రష్మిక మందన్న ‘మైసా’ పోటీ పడనున్నాయి. పూర్తి జాబితా కోసం మా రాబోయే చిత్రాలు పేజీ చూడండి.

Three very different films hit theatres for Telugu audiences this week: a sequel to a youth favourite, a feel-good drama and a big action drama.

ENE Repeat — November 19 (Thursday)

‘ENE Repeat’, the sequel to Tharun Bhascker’s 2018 cult comedy ‘Ee Nagaraniki Emaindi’, releases worldwide on Thursday, eight years to the day after the original. Vishwak Sen, Abhinav Gomatam and Venkatesh Kakumanu are back in the gang, while Srinath Maganti steps in for Sai Sushanth Reddy, who played Karthik in the first film. Anisha Ambrose and Shivathmika Rajashekar play key roles. At the trailer launch, Tharun Bhascker described the film as a complete laugh riot with emotional high points. Srujan Yarabolu and Sandeep Nagireddy produced it under S Originals, and Vivek Sagar composed the music.

Aakasamlo Oka Tara — November 20 (Friday)

Dulquer Salmaan stars in ‘Aakasamlo Oka Tara’, directed by Pavan Sadineni and produced by Swapna Cinemas, which opens on Friday with Satvika Veeravalli as the female lead and Shruti Haasan in a key role. The film has been cleared with a U/A certificate and no cuts. Censor board members reportedly praised the director for how it handles women’s empowerment, the bond between husband and wife, and the idea that dreams can be pursued without limits. It runs about 2 hours 36 minutes.

Om – Chapter 1 — November 20 (Friday)

Dhanush, Mammootty and Sai Pallavi lead ‘Om – Chapter 1’, directed by Rajkumar Periasamy of ‘Amaran’ fame, which also arrives in Telugu on Friday. Inspired by real incidents, the action drama is set in the world of red sanders smuggling, and ‘OM’ is the codename of the police operation (Operation Mole) to infiltrate the network. Sai Pallavi plays IPS officer Nithya Reddy, the trailer reveals Mammootty as the antagonist, and Sreeleela has a key role. Sai Abhyankkar composed the music. With Telugu audiences having embraced ‘Amaran’, expectations are high.

Next week: Bellamkonda Sai Sreenivas’s ‘Haindava’ and Rashmika Mandanna’s ‘Mysaa’ clash on November 27. See our Upcoming Movies page for the full calendar.

Share

సినిమా విభాగంలో మరిన్నిMore in Cinema