Friday, November 1, 2024

‘ప్రేమంటే ఏంటి..’ అంటూ ప్రేమికుల నోట ‘పెళ్లిసందD’ పాట

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకి ఏప్రిల్ 28 ఎంతో విశిష్టమైన రోజు. తెలుగు సినిమాకి కమర్షియల్ హంగులు అద్దుతూ.. సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ‘అడవి రాముడు’ చిత్రం విడుదలైన రోజు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా.. రికార్డులకు సరికొత్త అర్థం చెప్పిన చిత్రంగా ఇప్పటికీ చెప్పుకోబడుతుంది. అలాగే దర్శకేంద్రుని సమర్పణలో ఆయన శిష్యుడు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి 2’ చిత్రం విడుదలైన రోజు కూడా ఏప్రిల్ 28. ఈ చిత్ర రికార్డుల గురించి, కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పటికీ నాన్ బాహుబలి రికార్డులు అని చెప్పుకోవడమే కానీ.. బాహుబలిని బీట్ చేసిన రికార్డులు ఇంత వరకు రాలేదు. ఫ్యూచర్‌లో వస్తాయో రావో కూడా తెలియదు. మరి అలాంటి రోజుకు దర్శకేంద్రుడు విశిష్ట గౌరవాన్ని ఇచ్చారు. ఆయన సారథ్యంలో.. గౌరీ రోనంకి దర్శకత్వంలో ప్రేక్షకులను మెప్పించిన ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని మరోసారి ‘పెళ్లిసందD’గా తీసుకురాబోతున్నారు. ఈ ‘పెళ్లిసందD’ ఒక్కటి కాదు.. చాలా విశిష్టతలు ఉండటం విశేషం. తాజాగా ఏప్రిల్ 28ని పురస్కరించుకుని.. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది.

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌రవాణి కీర‌వాణి కాంబినేష‌న్‌లో వచ్చిన అప్ప‌టి ‘పెళ్లిసంద‌డి’ పాట‌లు ఇప్ప‌టికీ ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. ఈ ‘పెళ్లిసంద‌D’కి కూడా కీర‌వాణి సంగీతం అందించ‌గా.. దర్శకురాలు గౌరీ రోనంకి కూడా అప్పటి మ్యాజిక్‌ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేసేలానే ఉంది అనేలా.. ఈ ఫస్ట్ సాంగ్ కు రెస్పాన్స్ వస్తుండటం విశేషం. ఇద్దరు ప్రేమికులు.. ప్రేమంటే ఇదే అని చెప్పుకునే తీరును చక్కని సాహిత్యంతో లిరిసిస్ట్ చంద్రబోస్ వివరించగా.. అంతే చక్కగా శేఖర్ మాస్టర్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ పాట ప్రేమికుల నోట మారుమోగుతుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్లపై మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్త‌యినట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది.

రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్ర‌ఫీ: సునీల్ కుమార్‌
సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
సాహిత్యం: చంద్ర‌బోస్
ఆర్ట్‌: కిర‌ణ్
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
‌ఫైట్స్‌: వెంక‌ట్
కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కె. సాయిబాబా‌
బేన‌ర్స్‌: ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్
స‌మ‌ర్ఫ‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌
నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ
ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోనంకి

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x