Friday, November 1, 2024

ఒక్క పరుగు ముందు చతికిలబడ్డ ఢిల్లీ.. గెలుపుతో మళ్లీ టాప్‌కు ఆర్సీబీ

అహ్మదాబాద్: ఐపీఎల్ 14 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. చివరి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ స్టేడియం మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు వేదికగా మారింది. అయితే ఆఖరి బంతి వరకు పోరాడిన ఢిల్లీ.. విజయానికి రెండు పరుగుల ముందు ఆగిపోయింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్(58 నాటౌట్: 48 బంతుల్లో.. 6 ఫోర్లు), షిమ్రన్ హెట్‌మెయిర్(53 నాటౌట్: 25 బంతుల్లో.. 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరిసినా.. ఢిల్లీకి ఓటమి తప్పలేదు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ చివరి వరకు పోరాడి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేయడంతో విజయం ఆర్సీబీ సొంతమైంది. ఆర్సీబీ తరపున అర్థ సెంచరీతో రాణించి సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిసిన ఏబీడీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో ఆర్సీబీ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మరోసారి టాప్ ప్లేస్‌కు చేరింది. ఢిల్లీ మూడో స్థానానికి పడిపోయింది. కాగా.. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్‌కు 2 వికెట్లు దక్కగా.. మహ్మద్ సిరాజ్, కైల్ జేమీసన్‌లకు చెరో వికెట్ దక్కింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. ప్రారంభంలో తడబడినా మిడిలార్డర్లో ఏబీ డివిలియర్స్(75 నాటౌట్: 42 బంతుల్లో.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరవడంతో మంచి స్కోరు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ స్టార్ బౌలర్ మార్కస్ స్టోయినిస్ వేసిన ఆఖరి ఓవర్లో 3 సిక్స్‌లో ఏబీడీ అదరగొట్టాడు. దీంతో స్టోయినిస్.. వేసిన ఒక్క ఓవర్లోనే ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 171 పరుగులు చేసింది. డివిలియర్స్‌తో పాటు రజత్ పాటిదార్(31: 22 బంతుల్లో.. 2 సిక్స్‌లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్(25: 20 బంతుల్లో.. 1 ఫోర్, 2 సిక్స్‌లు) చక్కటి ప్రదర్శన చేశారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, కగిసో రబాడా, ఆవేష్ ఖాన్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x