Wednesday, January 22, 2025

“మహీష” టీజర్ విడుదల చేసిన దర్శకుడు కొండా విజయ్ కుమార్

ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “మహీష”. ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న మహీష సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ… మహీష సినిమా టీజర్ బాగుంది. సాంగ్స్ లోని సంగీతం, సాహిత్య విలువలు ఆకట్టుకున్నాయి. మహిళల మీద దాడులు ఎలా ఆపగలం అనే కాన్సెప్ట్ తో చేసిన చిత్రమిది. ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ చిత్రాన్ని రిలీజ్ చేయడం మరో ఎత్తు. ఈ చిత్రం మంచి విజయం సాధించి, సినిమా హీరో కమ్ డైరెక్టర్ ప్రవీణ్, ఇతర టీమ్ అందరికీ గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రామకృష్ణ మాట్లాడుతూ… చిన్న చిత్రాలు ఈ మధ్య కాలంలో ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా రిలీజైన చిన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. మహీష సినిమా కంటెంట్ చాలా బాగుంది. టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ మాట్లాడుతూ – మహీష కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా కొత్త తరహా స్క్రిప్ట్ ఇది. ఈ సినిమాకు మంచి సాంగ్స్ చేయగలిగాను అంటే అది దర్శకుడు ప్రవీణ్ ఇచ్చిన ఇన్ పుట్స్ వల్లే. ఆయన చాలా క్లారిటీగా సాంగ్స్ చేయించుకున్నారు. పాటల్లాగే సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు, హీరో ప్రవీణ్ కె.వి. మాట్లాడుతూ… మహీష సినిమా టీజర్ లాంఛ్ కు అతిథిగా వచ్చిన మా ఫేవరేట్ డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ గారికి థ్యాంక్స్. ఆయన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా అందరినీ ఇప్పటికీ అలరిస్తుంటుంది. మహీష సినిమా ఈ రోజు మహిళల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంతో రూపొందించాము. ధర్మాన్ని ఎలా కాపాడాలనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ ఎంతో శ్రద్ధతో మ్యూజిక్ చేశారు. సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నాం. ఈ సినిమాకు సీక్వెల్ గా యధా యధా హి ధర్మస్య అనే సినిమా చేయబోతున్నాం. అన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x