Friday, November 1, 2024

కళ్యాణ్ గారి కటౌట్ చూసి బలంగా కోరుకున్నా: హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. వకీల్ సాబ్ లోని జనగణ మన పాట లేజర్ షో తో కార్యక్రమం ప్రారంభమైంది. సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలోని మ్యూజికల్ షో అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు, దర్శకుడు జాగర్లమూడి క్రిష్, దర్శకుడు సురేందర్ రెడ్డి, దర్శకుడు హరీష్ శంకర్, దర్శకులు సాగర్ చంద్ర, మైత్రీ మూవీస్ నిర్మాత రవి శంకర్ నిర్మాత ఏఎం రత్నం, నిర్మాత బండ్ల గణేష్, ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ రామ్ తాళ్లూరి, సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత నాగ వంశీ, నాయికలు అంజలి, అనన్య నాగళ్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులను సత్కరించారు. వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, విద్యావేత్త పద్మావతి, తూప్రాన్ రైల్వే గేట్ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కాపాడిన సాహస బాలిక రుచిత సత్కారం పొందిన వారిలో ఉన్నారు.

దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మనకు వచ్చిన పండగ మనకు వకీల్ సాబ్. మన అందరి తరుపున పవన్ గారికి థాంక్స్. పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు స్టార్ట్ చేసినందుకు ఆయనకు పెద్ద థాంక్స్. ఆయన సినిమాల వల్ల వందల కోట్ల టర్నోవర్ తో తెలుగు చిత్ర పరిశ్రమ కరోనా లాక్ డౌన్ నుంచి మళ్లీ కోలుకుంటోంది. వేల మంది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. లాక్ డౌన్ తర్వాత సినిమా చేస్తున్న ప్రతి హీరోకు, నటీనటులకు, టెక్నీషియన్ కు ఈ వేదిక మీద నుంచి థాంక్స్. టాలీవుడ్ అంతా మన కుటుంబమే అనుకునే వ్యక్తి పవన్ గారు. ఫలానా సినిమా హిట్ అయింది అంటే ఆయన చాలా సంతోషపడతారు. ఆ తర్వాత అడుగుతారు ఎవరి సినిమా అని. ఆయనకు ఎవరి సినిమా అనేది సంబంధం లేదు. అన్ని సినిమాలు హిట్ కావాలి. అందరూ బాగుండాలని పవన్ గారు కోరుకుంటారు. తొలి ప్రేమ వందో రోజు నాకింకా గుర్తుంది. జనం కిటకిటలాడుతూ సంధ్య థియేటర్ లో రిపీట్ షోస్ పడుతున్నాయి. నేను ఆ గుంపులో షోకు వెళ్లేందుకు వేచి చూస్తున్నాను. అక్కడ కటౌట్ చూస్తూ ఒక కుర్రాడు ఈ హీరోతో సినిమా దర్శకత్వం చేయాలని అనుకున్నాడు. అక్కడే ఉన్న మరో డిస్ట్రిబ్యూటర్ ఈ హీరోతో సినిమా నిర్మించాలను కల గన్నాడు. దర్శకత్వం చేయాలనుకున్న కుర్రాడిని నేనైతే, సినిమా నిర్మించాలనుకున్న డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు. మా ఇద్దరి కలలు పవర్ స్టార్ చిత్రాలతో తీరాయి. రాజు గారు ఏ కథ విన్నా, క్యారెక్టర్ విన్నా నాకు ఫోన్ చేసి ఈ కథ, క్యారెక్టర్ పవన్ గారికి పడితే నెక్ట్ లెవెల్ ఉంటుంది హరీష్ అంటాడు. పవన్ గారి విషయం వచ్చేప్పటికి రాజు గారు తనో పెద్ద నిర్మాత అనే సంగతి మర్చిపోతారు. ఒక అభిమానిగా మాట్లాడుతారు. శిరీష్ అన్న కూడా పవన్ గారి సినిమా గురించే మాట్లాడుతుంటాడు. పవన్ గారి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు బాక్సాఫీస్ అంకెలు చూపిస్తా అని అంటుండేవారు. సినిమా మీద రాజన్న, శిరీష్ అన్న ప్యాషన్ అది. ఇక్కడున్న అందరిలో గబ్బర్ సింగ్ సినిమా ఎక్కువ సార్లు చూసింది దర్శకుడు శ్రీరామ్ వేణునే అనుకుంటా. నందాజీ కూర్చొండి చాలు అనే ఒక్క డైలాగ్ చాలు మనం వకీల్ సాబ్ పదే పదే చూసేందుకు. వకీల్ సాబ్ డబ్బింగ్ పూర్తయ్యిన తర్వాత పవన్ గారిని కలిశాను. రాత్రి నుంచి మార్నింగ్ దాకా డబ్బింగ్ చెప్పారట కదా అని అడిగాను. ఆయన రాత్రంతా డబ్బింగ్ చెప్పినా మొహంలో అలసట కనిపించలేదు. ఒక తృప్తి కనిపించింది. మంచి సినిమా చేశాననే సంతోషం కనిపించింది. ఆ సంతోషం ఏంటో ఏప్రిల్ 9న మీరు చూస్తారు. ఏ కీలుకు ఆ కీలు తీసే వకీల్ సాబ్ ను ట్రైలర్ లో చూశాం. థమన్ కెరీర్ బెస్ట్ ఫిలిం వకీల్ సాబ్. అంత బెస్ట్ వర్క్ చేశాడు. పవర్ స్టార్ సినిమా గురించి మీరెంత ఆకలిగా ఉన్నారో నేనూ అలాగే వేచి చూస్తున్నాను. లెట్స్ స్టార్ట్ సెలబ్రేషన్స్ ఆన్ ఏప్రిల్ 9. థాంక్స్. అన్నారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. వకీల్ సాబ్ సినిమా గురించి ఈ సందర్భంలో ఓ మాట చెప్పాలి. సోషల్ మీడియాలో వకీల్ సాబ్ స్టిల్స్, టీజర్, ట్రైలర్ చూసి సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. కథ కొద్దిగా ఉన్న చిత్రాలతోనే పవన్ గారు సూపర్ హిట్స్ కొడుతుంటారు. మరి ఇంత పెద్ద కథ ఉన్న వకీల్ సాబ్ తో ఆయన ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తారో ఊహించుకోవచ్చు. అన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x