ఎలుకలు ప్రధాన శత్రువు పాము. బొరియాల్లోనుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ పాము దాడి చేయాతుందో, ఏ పాము మింగేస్తుందోనని ఎలుకలు హదలిపోతుంటాయి. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో ఎలుకలు నిత్యం పాములబారినుంచి తప్పించుకోడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటాయి. అదృష్టం బాలేకపోతే దొరికిపోయి దానికి ఆహారమైపోతుంటాయి. అయితే తాజాగా పాము బారి నుంచి తప్పించుకోవడానికి ఓ ఎలుక చేసిన సాహసం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి సంబంధిందించిన వీడియో ఆన్ లైన్ లో విడుదల కావడంతో ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది.
వేటాడటంలో పాముల స్టైలే వేరు. మాటు వేసి మరీ చిన్న చిన్న జీవులను వేటాడుతాయి. అయితే ఎంత తెలివితో వేటాడినా.. ఒక్కోసారి మాత్రం ఎదురు దెబ్బ తింటుంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో అలాంటిదే. పాము మట్టిలో దాక్కుని, అటుగా వచ్చిన ఓ ఎలుకపై ఒక్కసారిగా అటాక్ చేసింది. కానీ ఈసారి ఎలుక తెలివి ముందు పాము పచ్చిక పారలేదు. వెంటనే అలెర్ట్ అయిన ఎలుక క్షణకాలంలో దాన్ని నుంచి తప్పించుకుని పారిపోయింది. దానైకంటే ముందు ప్రొఫెషనల్ రెజ్లర్ స్టైల్ లో రెండు కాళ్లతో పాము ముఖంపై ఓ స్ట్రెయిట్ కిక్ ఇచ్చింది. ఇదే ఈ వీడియోలో హైలైట్.
కాగా పాము చాలా ఒద్దికగా ఆకలి తీర్చుకునేందుకు అక్కడ కాపు కాసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అది మరుగు ఏర్పాటు చేసుకుని ఎవరికి కనిపించకుండా నక్కి ఉంది. అయితే ఇక్కడ ఎలుక బ్రతికిపోవడానికి మరో రీజన్ కూడా ఉంది. మొదట పాము అటాక్ చేయగానే.. ఒక్కసారిగా పక్కకి దూకిన ఎలుక ల్యాండింగ్ సమయంలో తన వెనుక కాళ్లతో పాము మూతిపై తన్నింది. దీంతో ఎస్కేప్ అవ్వడానికి దానికి కాస్త టైమ్ దొరికింది.
మరి ప్రాణం మీదికొస్తే పిల్లి కూడా పులి అవుతుందంటారు. ఇక్కడ ఎలుక కూడా అలానే అమేయమైన ధైర్యం చూపి ప్రాణాలను రక్షించుకుంది.