Wednesday, January 22, 2025

పవర్ స్టార్‌ని చూశాక.. నా ఫస్ట్ ఫీలింగ్ ఇదే: శ్రీరామ్ వేణు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. వకీల్ సాబ్ లోని జనగణ మన పాట లేజర్ షో తో కార్యక్రమం ప్రారంభమైంది. సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలోని మ్యూజికల్ షో అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు, దర్శకుడు జాగర్లమూడి క్రిష్, దర్శకుడు సురేందర్ రెడ్డి, దర్శకుడు హరీష్ శంకర్, దర్శకులు సాగర్ చంద్ర, మైత్రీ మూవీస్ నిర్మాత రవి శంకర్ నిర్మాత ఏఎం రత్నం, నిర్మాత బండ్ల గణేష్, ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ రామ్ తాళ్లూరి, సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత నాగ వంశీ, నాయికలు అంజలి, అనన్య నాగళ్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులను సత్కరించారు. వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, విద్యావేత్త పద్మావతి, తూప్రాన్ రైల్వే గేట్ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కాపాడిన సాహస బాలిక రుచిత సత్కారం పొందిన వారిలో ఉన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ.. అక్కడుండాల్సిన వాడిని ఇక్కడ ఉన్నాను అంటే కారణం పవన్ గారు. ఎంత పెద్ద సినిమా అయినా వైట్ పేపర్ మీద పెన్ తో రాసినప్పటి నుంచే మొదలవుతుంది. ఆ పని మొదట చేసిన అనిరుధ్ రాయ్ గారికి, సుజిత్ సిర్కార్ గారికి తమిళ్ లో రీమేక్ చేసిన బోనీ కపూర్ గారికి, అజిత్ గారికి పాదాబివనందనం. వారి వల్లే ఈ సినిమాను తెలుగులో చేసుకోగలిగాం. వకీల్ సాబ్ టీమ్ వర్క్, థమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, వినోద్ లాంటి డీవోపీ, రామజోగయ్య అద్భుతమైన సాహిత్యం మా గురువు గారు సుద్దాల అశోక్ తేజ కదులు కదులు అనే పాట రాశారు. ఇలా జీవితాలు మల్లీ ఇక్కడ కలిశాయి. ఆర్నెళ్లలో చేయాల్సిన సినిమా ఇది. లాక్ డౌన్ వల్ల ఏడాదిన్నర టైమ్ పట్టింది. ఈ టైమ్ లో నాతో కంప్లీట్ గా ట్రావెల్ అయిన బాబీ, తిరు ఇతర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నాతోనే ఉన్నారు. నివేదా, అంజలి, అనన్యను ఏంజెల్స్ అని పిలిస్తుంటారు. ప్రకాష్ రాజ్ గారు ఇతర నటీనటులకు థాంక్స్. దిల్ రాజు గారు త్రివిక్రమ్ గారికి, త్రివిక్రమ్ గారు పవన్ గారికి రికమెండ్ చేశారు.

ఒక రోజు త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి కళ్యాణ్ గారిని కలుద్దాం రండి అన్నారు. ఆయన ఇంటికి వెళ్తే అక్కడ పవన్ గారు ఉన్నారు. అక్కడ తెల్లటి దుస్తుల్లో పవన్ గారిని చూస్తుంటే ఒక గుడిలోకి వెళ్తున్నట్లు ఫీలింగ్ కలిగింది. హిమాలయాల గురించి చదివినప్పుడు ప్రేమతో పాటు భయంగా అనిపిస్తుంది. అవి కరిగితే దేశం మునిగిపోతుందనే భయం. ఈ ప్రేమ, భయం అనే రెండు ఫీలింగ్స్ నేను పవన్ గారిని తొలిసారి కలిసినప్పుడు అనుభూతి చెందాను. ఐయామ్ ప్రౌడ్ ఫ్యాన్ ఆఫ్ పీఎస్ పీకే. బలంగా నమ్మిందే విధి అనుకుంటాను. నేను ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసింది పవన్ గారి యాడ్ కి. సంధ్య థియేటర్లో తొలిప్రేమ సినిమా చూసిన రాజు గారు, హరీష్ శంకర్ గారితో పాటు నేనూ అక్కడే ఉన్నా. కానీ నేను పవన్ గారి చిత్రానికి దర్శకుడిని అవుతానని అనుకోలేదు. 42 రోజులు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చేశాం. ప్రతి రోజూ, ప్రతి మీటింగ్, ప్రతి డిస్కషన్ సంతోషంగా సాగింది. డబ్బింగ్ పూర్తయ్యాక నా భుజం తట్టారు. తొలి రోజు నుంచి ఇప్పటిదాకా పవన్ గారితో నేనున్న ప్రతి క్షణం అపురూపమే. సినిమాలో ఉన్నదే కాదు మిగిలిన రష్ కూడా నాకు సంతోషాన్నిస్తుంది. పవన్ గారికి రుణపడి ఉంటాను. ఆయన కోరుకుంటే దేశంలో ప్రతిదర్శకుడు సినిమా చేస్తాడు. ఒక టైలర్ కొడుకును, డిగ్రీ చేసిన వ్యక్తిని నాతో సినిమా చేయడం అదృష్టం. వకీల్ సాబ్ చిత్రం ద్వారా మన జీవితంలో మహిళల గొప్పదనం చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో ఉన్న స్త్రీ మూర్తులకు థాంక్స్. మహిళల పట్ల మీ చూపు మార్చుకోండి. అన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x