శ్రీ నందు 'మగాళ్లు జిందాబాద్' టైటిల్ లాంచ్.. వెన్నెల కిషోర్, వైవా హర్షలతో కామెడీ ఎంటర్‌టైనర్
యువ హీరో శ్రీ నందు నటిస్తున్న 'మగాళ్లు జిందాబాద్' చిత్రం టైటిల్ లాంచ్ ఘనంగా జరిగింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీతో సెటైరికల్ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందుతోంది.
యువ హీరో శ్రీ నందు నటిస్తున్న కొత్త చిత్రం ‘మగాళ్లు జిందాబాద్’ టైటిల్ లాంచ్ ఇటీవల ఘనంగా జరిగింది. ఇందులో స్టార్ కమెడియన్లు వెన్నెల కిషోర్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లక్ష్మీ దుర్గ, అక్షర గౌడ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు.
గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారా ప్రవీణ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సమాజంలో పురుషుల భావోద్వేగాలు, ఇబ్బందులను వ్యంగ్యంగా, హాస్యంగా చూపించే సెటైరికల్ కామెడీగా ఈ సినిమా రూపొందుతోంది. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
సాంకేతిక వర్గం:
- సంగీతం: శ్రీ చరణ్ పాకాల, మదిన్ ఎస్.కె.
- నేపథ్య సంగీతం: మున్నా కాశీ
- ఛాయాగ్రహణం: సమీర్ కళ్యాణి
- ఎడిటింగ్: శ్రీధర్ సొంపల్లి
- ఆర్ట్: అమ్ము కార్తిక్
- సహ నిర్మాతలు: రాధిక కార్ల, భాస్కర్ల చంద్రశేఖర్, లక్ష్మీ భవాని
- పబ్లిసిటీ: ధని ఏలే



.jpg)

