కంటెంట్‌కు వెళ్లండిSkip to content
27, అక్టోబర్ 2026, మంగళవారంTuesday, 27 October 2026
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates

గొప్ప సందేశంతో తెరకెక్కిన 'హుషారు 2' కచ్చితంగా హిట్ అవుతుంది: టీజర్ లాంచ్‌లో ఆర్. నారాయణమూర్తి'Husharu 2' Carries a Great Message and Will Definitely Be a Hit: R. Narayana Murthy at the Teaser Launch

శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా తదితరులు నటించిన 'హుషారు 2' టీజర్ మంగళవారం విడుదలైంది. ముఖ్య అతిథిగా హాజరైన పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అన్నారు.The teaser of Sri Harsha Konuganti's 'Husharu 2', starring Rahul Ramakrishna and Ashok Galla, was launched on Tuesday. Chief guest R. Narayana Murthy, who plays a key role, said the film tackles unemployment with humour and will definitely be a hit.

Cine Sarkar Desk
Share
'హుషారు 2' టీజర్ లాంచ్ ఈవెంట్
'హుషారు 2' టీజర్ లాంచ్ ఈవెంట్

హెచ్‌కే ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్ బ్యానర్లపై రాహుల్ వర్మ, కె. వీణా రాణి, కె. హనుమంత్ రాజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హుషారు 2’. ఈ సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంటోనీ, దినేష్ తేజ్, శశిధర్, రాజై రోవన్, అభిజ్ఞ, శ్రీకాంత్ కన్ని, బాబీ రాచకొండ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నిరుద్యోగ సమస్యను గొప్పగా చూపించారు: ఆర్. నారాయణమూర్తి

’హర్ష గారు ’హుషారు 2’లో నాకు గొప్ప పాత్ర ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్ర పోషించాను. ’హుషారు’లో ఎంత నవ్వించారో, అంతకు మించి నవ్విస్తూనే ఆలోచించేలా చేస్తారు. నిరుద్యోగ సమస్యను ఎంతో గొప్పగా చూపించారు. పని హక్కును కోల్పోతున్నాం. శ్రమకు తగ్గ ప్రతిఫలం లేదు. నలిగిపోతున్న యువతకు స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆత్మాభిమానంతో బతకాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటి గొప్ప చిత్రాన్ని ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ‘హుషారు 2’ కచ్చితంగా హిట్ అవుతుంది. దర్శకుడు హర్ష ఎక్కడా రాజీ పడడు. రవిరాజా పినిశెట్టి తర్వాత నాకు హర్షలో ఆ క్వాలిటీ కనిపించింది. కెమెరామెన్ ఎంతో ఓర్పుగా పనిచేశాడు. సినిమా నచ్చితే ప్రజలు ఎవరినైనా స్టార్లను చేస్తారు. అలా జనాలకు నచ్చేలా హర్ష ఈ సినిమా తీశారు. ‘హుషారు 2’ను జనాల దగ్గరకు తీసుకెళ్లాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అన్నారు.

టీజర్‌కు మించి సినిమాలో నవ్వులు: అశోక్ గల్లా

’‘హుషారు 2’ టీజర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతోందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో మా నలుగురి పాత్రలు ఎంతో వినోదాత్మకంగా ఉంటాయి. మాకు గురువులా మూర్తి గారి పాత్ర ఉంటుంది. సినిమా ఆరంభం నుంచే నవ్విస్తాం. టీజర్‌కు మించి సినిమాలో నవ్వులు ఉంటాయి. ఇది కేవలం టీజర్ లాంచ్ ఈవెంట్, మిగతాది సక్సెస్ మీట్‌లో మాట్లాడతాను’ అని అన్నారు.

రాహుల్ రామకృష్ణ

’‘హుషారు 2’ టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మేం కూడా టీజర్‌ను ఇప్పుడే చూస్తున్నాం. టీజర్‌ను మించి సినిమా ఉంటుంది. మా చిత్రాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నా స్నేహితులతో జరిగిన సంఘటనలే ఈ కథ: శ్రీ హర్ష కొనుగంటి

’‘హుషారు’ నా జీవితంలో బెస్ట్ మెమరీ. రెండో పార్ట్‌ను ఏదో తీయాలని తీయలేదు. నా జీవితంలో స్నేహితులతో కలిసి జరిగిన సంఘటనల ఆధారంగానే ‘హుషారు 2’ తీశాను. నా చిన్ననాటి స్నేహితుడు రాహుల్ వర్మ ఈ సినిమాతో నిర్మాణంలోకి వచ్చాడు. రాహుల్ నాకు మంచి స్నేహితుడు. ఈ చిత్రంలో రాహుల్ (రామకృష్ణ) పాత్ర అద్భుతంగా ఉంటుంది. సినిమా చూస్తే అశోక్ గల్లా, శశి, దినేష్, రవి ఆంటోనీ రియల్ లైఫ్‌లో కూడా ఫ్రెండ్స్‌లా కనిపిస్తారు. మూర్తి గారితో పనిచేయడం ప్రైస్‌లెస్ మూమెంట్స్. ఆయనతో ఉండే సీన్స్ థియేటర్‌లో బ్లాస్ట్ అవుతాయి. సినిమా చాలా బాగా వచ్చింది. రాబోయే ఈవెంట్లలో మరిన్ని విషయాలు మాట్లాడతాను’ అని అన్నారు.

నిర్మాత రాహుల్ వర్మ

’‘హుషారు’ నాకు చాలా నచ్చింది. అందులో నా జీవితాన్ని, నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. ‘హుషారు 2’ను నేను నిర్మించడం ఆనందంగా ఉంది. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆర్. నారాయణమూర్తి గారు మా సినిమాలో ఉండటం మా అదృష్టం. సినిమా అందరినీ మెప్పిస్తుందని అనుకుంటున్నాను’ అని అన్నారు.

విధి యాదవ్

’‘హుషారు 2’ను ఎంతో కష్టపడి చేశాం. ప్రేమ, స్నేహం, హాస్యం ప్రధాన అంశాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ ప్రయాణంలో నేను ఎంతో నేర్చుకున్నాను. మా టీజర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలానే మాకు సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

దినేష్ తేజ్

’మళ్లీ నాకు ‘హుషారు’ రోజులు గుర్తుకొచ్చాయి. హర్ష నాకు మొదటి అవకాశం ఇచ్చాడు. ’హుషారు’కు పది రెట్ల వినోదాన్ని ఇచ్చేలా ‘హుషారు 2’ ఉంటుంది. రాహుల్ అన్నతో మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉంది. ఆర్. నారాయణమూర్తి గారు మా సినిమాలో ఉండటం అదృష్టం. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. త్వరలోనే మా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ రామిశెట్టి

’హర్షతో కలిసి ‘ఓం భీమ్ బుష్’ చేశాను. మా ఇద్దరికీ ఫ్రీక్వెన్సీ కుదిరింది. హర్ష కథలను చాలా కొత్తగా రాస్తుంటారు. ’హుషారు 2’తో హర్ష అనుకున్నది నేను నెరవేర్చానని అనుకుంటున్నాను. ‘హుషారు 2’ టీమ్ నా కుటుంబంలా మారింది. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

నటీనటులు: రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంటోనీ, దినేష్ తేజ్, శశిధర్, రాజై రోవన్, అభిజ్ఞ, శ్రీకాంత్ కన్ని, బాబీ రాచకొండ తదితరులు

సాంకేతిక వర్గం:

  • బ్యానర్లు: హెచ్‌కే ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్
  • నిర్మాత: రాహుల్ వర్మ
  • దర్శకుడు: శ్రీ హర్ష కొనుగంటి
  • ఛాయాగ్రహణం: శ్రీనివాస్ రెడ్డి జి
  • ఆర్ట్ డైరెక్టర్లు: శ్రీకాంత్ రామిశెట్టి, కె.వి. రమణ
  • కాస్ట్యూమ్ డిజైనర్: ఆజాద్ వర్మ
  • పీఆర్వో: బియాండ్ మీడియా (నాయుడు - ఫణి)

‘Husharu 2’ is produced jointly by Rahul Varma, K. Veena Rani and K. Hanumanth Raju under the HK Films and Kaliyuga Varadha Creations banners, and directed by Sri Harsha Konuganti. The cast includes Rahul Ramakrishna, Ashok Galla, Ravi Antony, Dinesh Tej, Sasidhar, Rajai Rowan, Abhigna, Srikanth Kanni and Bobby Rachakonda. The film’s teaser was released on Tuesday, and People’s Star R. Narayana Murthy attended the launch event as chief guest.

It shows the unemployment problem brilliantly: R. Narayana Murthy

“Harsha garu gave me a great role in ‘Husharu 2’. I have played a good role after many years. The film will make you laugh even more than ‘Husharu’ did, and make you think as well. It portrays the problem of unemployment brilliantly. We are losing the right to work, and there is no fair reward for hard work. The film gives struggling young people a great message: live independently, freely and with self-respect. I hope people embrace such a good film. ‘Husharu 2’ will definitely be a hit. Director Harsha never compromises; after Ravi Raja Pinisetty, I see that quality in him. The cameraman worked with great patience. If people like a film, they will make anyone a star, and Harsha has made this film to win people over. I request the media to take ‘Husharu 2’ to the people.”

More laughs than the teaser: Ashok Galla

“The teaser makes it clear what ‘Husharu 2’ is going to be like. The four of us have very entertaining roles, and Murthy garu plays a kind of mentor to us. We make you laugh right from the start, and the film has even more laughs than the teaser. This is just the teaser launch; I’ll say the rest at the success meet.”

Rahul Ramakrishna

“I hope everyone liked the ‘Husharu 2’ teaser. We are seeing it for the first time too. The film will be even better than the teaser, and I hope everyone supports it.”

Based on things that happened with my friends: Sri Harsha Konuganti

“‘Husharu’ is the best memory of my life. I didn’t make a second part just for the sake of it. ‘Husharu 2’ is based on incidents from my own life with my friends. My childhood friend Rahul Varma has turned producer with this film, and he is a good friend. Rahul (Ramakrishna)’s role in this film is wonderful. When you watch it, Ashok Galla, Sasi, Dinesh and Ravi Antony look like friends in real life too. Working with Murthy garu gave me priceless moments, and his scenes will be a blast in theatres. The film has turned out very well. I’ll share more at the upcoming events.”

Producer Rahul Varma

“I loved ‘Husharu’. I felt I saw my own life, and myself, in it. I’m happy to be producing ‘Husharu 2’. Everyone has supported me a lot. Having R. Narayana Murthy garu in our film is our good fortune, and I think the film will please everyone.”

Vidhi Yadav

“We worked very hard on ‘Husharu 2’. The film is built around love, friendship and humour, and I learned a lot on this journey. I think everyone liked our teaser, and I hope you keep supporting us.”

Dinesh Tej

“It brought back the ‘Husharu’ days for me. Harsha gave me my first chance. ‘Husharu 2’ will be ten times as entertaining as ‘Husharu’. I’m happy to work with Rahul anna again, and it’s our luck to have R. Narayana Murthy garu in the film. It will appeal to everyone, and it will reach audiences soon.”

Art director Srikanth Ramisetty

“I worked with Harsha on ‘Om Bheem Bush’, and we are on the same wavelength. Harsha writes his stories in a very fresh way, and I think I have delivered what he imagined for ‘Husharu 2’. The team has become my family. The film will appeal to everyone.”

Cast: Rahul Ramakrishna, Ashok Galla, Ravi Antony, Dinesh Tej, Sasidhar, Rajai Rowan, Abhigna, Srikanth Kanni, Bobby Rachakonda and others

Crew:

  • Banners: HK Films, Kaliyuga Varadha Creations
  • Producer: Rahul Varma
  • Director: Sri Harsha Konuganti
  • Cinematography: Srinivas Reddy G
  • Art directors: Srikanth Ramisetty, K.V. Ramana
  • Costume designer: Azad Varma
  • PRO: Beyond Media (Naidu - Phani)
Share

సినిమా విభాగంలో మరిన్నిMore in Cinema