కంటెంట్‌కు వెళ్లండిSkip to content
6, అక్టోబర్ 2026, మంగళవారంTuesday, 6 October 2026
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates

చాక్లెట్ స్టార్ పవన్ 'పోతిరెడ్డిపల్లి' ప్రారంభం.. విలేజ్ హారర్ థ్రిల్లర్‌కు బాబు మోహన్ క్లాప్Chocolate Star Pavan's 'Pothireddy Palli' Launched: Babu Mohan Sounds the Clap for Village Horror Thriller

చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా, మౌనిక, సిరి హీరోయిన్లుగా అశోక్ రొయ్య దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ 'పోతిరెడ్డిపల్లి' హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.'Pothireddy Palli', a horror thriller starring Chocolate Star Pavan with Mounika and Siri and directed by Ashok Royya, was launched with a pooja ceremony at Ramanaidu Studios, Hyderabad.

Cine Sarkar Desk
Share

చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘పోతిరెడ్డిపల్లి’ అక్టోబర్ 5న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై జేరం విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మౌనిక, సిరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశోక్ రొయ్య దర్శకత్వం వహిస్తున్నారు.

గ్రామీణ నేపథ్యంలో మిస్టరీ, సస్పెన్స్ అంశాలతో సాగే హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రారంభోత్సవానికి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, సీనియర్ నటుడు బాబు మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి బాబు మోహన్ క్లాప్ కొట్టారు. దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మరాజ్ శేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, తెలుగు సినిమా దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.

ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్‌గా ‘పోతిరెడ్డిపల్లి’ తెరకెక్కుతోందని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని హీరో పవన్ చెప్పారు. ఇది తన రెండో సినిమా అని, కథను విభిన్నంగా చూపించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని దర్శకుడు అశోక్ రొయ్య తెలిపారు.

చిత్ర వివరాలు:

  • హీరో: చాక్లెట్ స్టార్ పవన్
  • హీరోయిన్లు: మౌనిక, సిరి
  • బ్యానర్: ఆరాధ్య క్రియేషన్స్
  • నిర్మాత: జేరం విష్ణు
  • దర్శకత్వం: అశోక్ రొయ్య

Chocolate Star Pavan’s new film ‘Pothireddy Palli’ was launched with a pooja ceremony at Ramanaidu Studios in Hyderabad on October 5. Produced by Jeram Vishnu under the Aradhya Creations banner, the film features Mounika and Siri as the female leads and is directed by Ashok Royya.

The film is a horror thriller with mystery and suspense, set against a rural backdrop. Former Deputy Chief Minister Rajayya, former Medical and Health Minister Lakshma Reddy, National BC Welfare Association president and Rajya Sabha MP R. Krishnaiah, and senior actor Babu Mohan attended the launch as chief guests.

Babu Mohan sounded the clap for the first shot, featuring the hero and heroines. Director and choreographer Ammaraj Shekhar switched on the camera, and Telugu Movie Directors Association president V.N. Aditya directed the first shot.

Pavan said ‘Pothireddy Palli’ is being made as an engaging horror thriller with an interesting storyline that will give audiences a fresh experience. Director Ashok Royya said this is his second film and that the team is making every effort to tell the story in a distinctive way.

Film Details:

  • Hero: Chocolate Star Pavan
  • Heroines: Mounika, Siri
  • Banner: Aradhya Creations
  • Producer: Jeram Vishnu
  • Director: Ashok Royya
Share

సినిమా విభాగంలో మరిన్నిMore in Cinema