'డ్యూ డేట్' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.. లోమేష్ పూడిపెద్ది, జయశ్రీ జంటగా కోర్ట్‌రూమ్ డ్రామా'Due Date' Goes on Floors: Lomesh Pudipeddi and Jayashree Lead a Courtroom Drama
లోమేష్ పూడిపెద్ది, జయశ్రీ జంటగా ఆనంద్ కె. దర్శకత్వంలో రూపొందుతున్న కమర్షియల్ కోర్ట్‌రూమ్ డ్రామా 'డ్యూ డేట్' రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో ఏలూరు శ్రీను ఈ చిత్రంతో నిర్మాతగా మారారు.The regular shoot of 'Due Date', a commercial courtroom drama starring Lomesh Pudipeddi and Jayashree and directed by Anand K, has begun in Hyderabad. Well-known film journalist and PRO Eluru Srinu turns producer with the film.
Instagram వీడియోInstagram video
Instagramలో చూడండిWatch on Instagram →లోమేష్ పూడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘డ్యూ డేట్’. వరిష్ స్టూడియోస్ బ్యానర్‌పై పవన్ తరిగొప్పుల, ఏలూరు శ్రీను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ కె. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో మొదలైన తొలి షెడ్యూల్ వరుసగా 15 రోజుల పాటు జరగనుంది.
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో ఏలూరు శ్రీను ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమవుతున్నారు. ప్రణీత పట్నాయక్, విజ్ఞాని, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
సమకాలీన, కీలకమైన సమస్య చుట్టూ అల్లిన కమర్షియల్ కోర్ట్‌రూమ్ డ్రామా ఇదని నిర్మాతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి నెలా గుర్తుంచుకునే ఒక ‘డ్యూ డేట్’ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, ఆ సుపరిచితమైన అంశాన్ని వినోదం, భావోద్వేగం, ఉత్కంఠతో కూడిన కోర్ట్‌రూమ్ డ్రామాగా మలిచామని చెప్పారు. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో సినిమాను తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
చిత్ర వివరాలు:
- హీరో: లోమేష్ పూడిపెద్ది
- హీరోయిన్: జయశ్రీ
- ఇతర పాత్రలు: ప్రణీత పట్నాయక్, విజ్ఞాని, కృష్ణ భగవాన్
- ఛాయాగ్రహణం: చెంచు జింక
- ఎడిటింగ్: సత్య గిడుతూరి
- ఆర్ట్: జవ్వాది నాయుడు
- మాటలు: హరీష్ మీనన్
- నిర్మాతలు: పవన్ తరిగొప్పుల, ఏలూరు శ్రీను
- బ్యానర్: వరిష్ స్టూడియోస్
- దర్శకత్వం: ఆనంద్ కె.
‘Due Date’ stars Lomesh Pudipeddi and Jayashree in the lead roles. Produced jointly by Pawan Tharigopula and Eluru Srinu under the Varish Studios banner, the film is directed by Anand K. Its regular shoot has begun in Hyderabad. The first schedule opened with key scenes featuring the lead cast and will run for 15 consecutive days.
Well-known film journalist and PRO Eluru Srinu makes his debut as a producer with this film. Praneetha Patnaik, Vignani and Krishna Bhagavan play important roles.
The producers describe it as a commercial courtroom drama woven around a contemporary, pressing issue. The story revolves around a ‘due date’ that everyone remembers every month, turning that familiar idea into a courtroom drama with entertainment, emotion and suspense. They said the film has been written with a gripping screenplay designed to keep audiences engaged from start to finish.
Film Details:
- Hero: Lomesh Pudipeddi
- Heroine: Jayashree
- Cast: Praneetha Patnaik, Vignani, Krishna Bhagavan
- Cinematography: Chenchu Jinka
- Editing: Satya Giduturi
- Art: Javvadi Naidu
- Dialogues: Harish Menon
- Producers: Pawan Tharigopula, Eluru Srinu
- Banner: Varish Studios
- Director: Anand K
సినిమా విభాగంలో మరిన్నిMore in Cinema

హిట్ మెషిన్ అనిల్ రావిపూడి చేతులు మీదుగా ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదలStar Director Anil Ravipudi Launches 'Saripoyaru Iddaru' Teaser

చాక్లెట్ స్టార్ పవన్ 'పోతిరెడ్డిపల్లి' ప్రారంభం.. విలేజ్ హారర్ థ్రిల్లర్‌కు బాబు మోహన్ క్లాప్Chocolate Star Pavan's 'Pothireddy Palli' Launched: Babu Mohan Sounds the Clap for Village Horror Thriller



