ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా 'నీ నానుండి దూరంగా' పాట లాంచ్
ఎంఎస్ఎం ప్రొడక్షన్స్ రూపొందించిన 'నీ నానుండి దూరంగా' పాట లాంచ్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎంఎస్ఎం ప్రొడక్షన్స్ నిర్మించిన ‘నీ నానుండి దూరంగా’ పాట లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నటుడు వికాస్ వశిష్ట ముఖ్య అతిథులుగా హాజరై బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
జ్ఞానానంద దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు రామ్‌చరణ్ మాటూరి సంగీతం అందించారు. ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందించిన ఈ పాట ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని బృందం తెలిపింది. పాటలో అభిరామ్ పాత్రలో గిరిధర్, జానకి పాత్రలో మధు నటించారు.
లాంచ్ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథులు, పాట సంగీతం, విజువల్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయని అభినందించారు.



.jpg)

