Wednesday, January 22, 2025

‘పంచతంత్రం’లోని రాహుల్ విజయ్ లుక్ విడుదల

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. సోమవారం (జూన్ 7) రాహుల్ విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ నటిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా ‘పంచతంత్రం’తో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ.. “పెళ్లి, కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే విషయాల్లో కచ్చితమైన భావాలు ఉన్న 28 సంవత్సరాల యువకుడు సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ కనిపిస్తారు. ఈతరం యువతకు పెళ్లి, జీవితాంతం కొనసాగే బంధాలు, బాధ్యతలు వంటి విషయాల్లో ఉండే కన్‌ఫ్యూజన్‌ను, క్లారిటీని చూపించే పాత్ర. సింపుల్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు” అని చెప్పారు.

ఈ సందర్భంగా నిర్మాత సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. “రాహుల్ విజయ్ కు మా ‘పంచతంత్రం’ చిత్రబృందం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. సుభాష్ పాత్రలో అతను కనిపిస్తాడు. అతడిలో ఇప్పటి యువత తమను తాము చూసుకుంటారు. నేటి యువతరానికి ప్రతినిధి లాంటి సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ సహజంగా నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది. జూలైలో లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. అటు ఇటుగా పది రోజులు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. లాక్‌డౌన్‌లో ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించాం” అని అన్నారు.

నటీనటులు:
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.

సాంకేతిక వర్గం:
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), అసోసియేట్ డైరెక్టర్: విక్రమ్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియమ్‌, ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి, నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు, రైటర్‌–డైరెక్టర్‌: హర్ష పులిపాక.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x