ఘనంగా 'సాV3' టీజర్ లాంచ్ ఈవెంట్.. బిగ్‌బాస్ సెలబ్రిటీల సందడి
సామ్రాట్, డెమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన 'సాV3' చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
సామ్రాట్, డెమోన్ పవన్, ‘రాను బొంబాయికి రాను’ పాటతో పేరుపొందిన లిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన ‘సాV3’ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.
లక్ష్మీ కృష్ణ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వి. విజయ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నటుడు, దర్శకుడు కృష్ణ మాయ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
క్రెడిట్స్
- నిర్మాణ సంస్థ: లక్ష్మీ కృష్ణ ఫిల్మ్స్
- నిర్మాత: వి. విజయ
- దర్శకత్వం: కృష్ణ మాయ
- పీఆర్వో: వీరబాబు





