సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ : సినీ పెద్ద మురళీమోహన్ గారి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా నన్ను ఈ ఈవెంట్ కి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. విష్ణు బొప్పన గారు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అన్నారు. బిజీ షెడ్యూల్ ని కూడా పక్కనపెట్టి మురళీమోహన్ గారి కోసం ఈవెంట్ కి రావడం జరిగింది. ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మురళీమోహన్ గారు ఆయన్ని సన్మానించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒక సినీ యాక్టర్ గా చూశాను రాజకీయ నాయకుడిగా చూసాను బయట మంచి వ్యక్తిగా కూడా చూడడం జరిగింది అలాంటి వ్యక్తికి సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది. విజయవంతంగా విష్ణు బొప్పన గారు వి బి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ ఆపకుండా చేయడం పదో వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. విష్ణు బొప్పన గారికి ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది అంటూ ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలను కొనియాడారు.
మురళీమోహన్ గారు మాట్లాడుతూ : విష్ణు బొప్పన గారు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. మంత్రిగారు చేతుల మీదుగా నాకు ఈ సన్మానం జరగడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఎంతో బిజీగా ఉండి కూడా ఈవెంట్ వచ్చి నా సన్మానానికి హాజరై ఇలా ఆశీస్సులు అందించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వి బి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ ఫంక్షన్ ఇలా పదో వార్షికోత్సవం విజయవంతంగా జరుపుకోవడం ఈ ఫంక్షన్ లో నన్ను సన్మానించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విష్ణు బొప్పన గారు ఇలాగే అవార్డ్స్ ఫంక్షన్ కంటిన్యూ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నా 50 సంవత్సరాల నట జీవితాన్ని పురస్కరించుకుని ‘నటసింహ చక్రవర్తి’ బిరుదునివ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో అవార్డులు వాళ్ళు చేసిన కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అవార్డులు అందిస్తోంది. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి నంది అవార్డులకున్న విశిష్టత మనకు తెలుసు. కానీ తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డుల గురించి పట్టించుకోవడమే మానేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో మళ్లీ అది మొదలు పెట్టాలని ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అవార్డులను ఇవ్వాలి అలానే ఇకనుంచి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరిగేలా మీ ప్రభుత్వం చూడాలి అని విజ్ఞప్తి చేసుకుంటున్నాను అన్నారు.
మురళీమోహన్ గారు చేసిన విజ్ఞప్తికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందిస్తూ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ మురళీమోహన్ గారు చెప్పిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మా గవర్నమెంట్ కచ్చితంగా పూర్తి చేస్తాము. తెలుగు రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళు అందరం ఒకటే. గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సి ఉన్న అవార్డులు అన్నిటినీ కూడా కచ్చితంగా ఇచ్చే విధంగా మా గవర్నమెంట్ చేస్తుంది అని ఘాటుగా స్పందించారు.
వి బి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన గారు మాట్లాడుతూ : ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఇంత ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఏడాది పేద కళాకారులకు స్కూల్ ఫీజులు లేదా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఈసారి వికలాంగులకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతులు మీదుగా చెక్కుల అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అవార్డ్స్ ఫంక్షన్ ఇంత ఘనంగా జరగడానికి కారణం మా స్పాన్సర్ విజన్ వి వి ఈ హౌసింగ్ ఇండియా, ఎస్ ఎస్ ఎల్ గ్రూప్, ఆదూరి గ్రూప్, డి ఎస్ ఆర్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా, ఆరాధ్య గ్రూప్, కేశినేని డెవలపర్స్ మరియు హో జాయ్ కంఫర్ట్ వారు ఇచ్చిన సపోర్ట్. ఈ సంవత్సరం తో పదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ పదో వార్షికోత్సవ అవార్డ్స్ సందర్భంగా మురళీమోహన్ గారిని సన్మానించుకోవడం ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్ కి బిజీగా ఉన్నా మా మనవిని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇదే ఉత్సాహంతో ఇంకా ముందు ముందు ఎన్నో అవార్డు ఫంక్షన్లు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అతిథులుగా సీతారామం దర్శకుడు హను రాఘవపూడి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, బింబిసార దర్శకుడు వశిష్ట, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, హీరోయిన్ ఎస్తేర్, గాయని హారిక నారాయణ, గాయకుడు కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.