విష్వక్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం `పాగల్`. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. సినిమా ఆగస్ట్ 14న విడుదలవుతుంది. ఈ సందర్బంగా హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ విశేషాలు…
– ‘పాగల్’ స్క్రిప్ట్‌ను డైరెక్టర్ నరేశ్ కుప్పిలి చెన్నై వచ్చి నెరేట్ చేశాడు. ఫస్ట్ టైమ్ వినగానే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఈ స్క్రిప్ట్ దిల్‌రాజు గారికి బాగా నచ్చింది. ఆయన కూడా నాతో మాట్లాడారు. అంత అనుభవమున్న దిల్‌రాజుగారు కాన్ఫిడెంట్‌గా మాట్లాడిన విధానంతో సినిమాలో నటించాలని అనుకున్నాను. పాండమిక్ తర్వాత షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. సినిమాను చకచకా పూర్తి చేశాం. నేను పూర్తి సినిమాను కూడా చూశాను. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది.
– డైరెక్టర్ నరేశ్‌గారు ఈ స్క్రిప్ట్‌ను ఐదు సార్లు నెరేట్ చేశారు. స్క్రిప్ట్ నెరేషన్ టైమ్‌లోనే కొన్ని చోట్ల నేను ఏడ్చాను. తొలిసారే కాదు.. స్క్రిప్ట్ విన్నప్పుడంతా ఆ ఎమోషనల్ సీన్స్‌కు కన్నీళ్లొచ్చాయి. రీసెంట్‌గా సినిమాను చూసినప్పుడు ఆ ఎమోషనల్ సీన్స్‌లో కన్నీళ్లొచ్చాయి. నటీనటులందరూ చాలా గొప్పగా నటించారు.
– సినిమా అంతా లవ్ ఫీల్‌తోనే ఉంటుంది. `సఖి` సినిమాలో మాధవన్, షాలిని మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో, అలాంటి ఎమోషన్స్ మా సినిమాలోనూ ఉంటాయి.
– నేను చూడటానికి సీరియస్ అమ్మాయిలా కనపడతాను. కానీ నిజానికి నేనలా ఉండను. నాకు వచ్చే పాత్రలు కూడా అలాగే ఉంటున్నాయి. రీసెంట్‌గానే రేసింగ్‌లో ఫస్ట్ లెవల్‌ను పూర్తి చేశాను. రేసింగ్ లొకేషన్‌కు వెళ్లగానే సినిమా అంటే ఏంటో పూర్తిగా మరచిపోతాను. హీరోయిన్స్, ఇతర స్టార్స్ సినిమాలతో పాటు మరో ఫీల్డ్‌పై అవగాహన పెంచుకుంటే బావుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాండమిక్ టైమ్‌లో సినిమాలు రావడం లేదంటూ చాలా మంది డిప్రెషన్‌లోకి వెళుతున్నారు. సినిమాలు లేకుండా, అల్టర్‌నేటివ్ ఉందనుకోండి.. ఆ పనిని చేసుకోవచ్చు. నేను ఫార్ములా వన్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే మూడు తమిళ సినిమాలు సైన్ చేశాను.
– `పాగల్` సినిమాలో నా పాత్ర పేరు తీర… ముందుగా నా క్యారెక్టర్‌కు గీత అని పేరు పెట్టారు. అయితే అందులో ఫీల్ లేదనిపించింది. అందుకని బాగా ఆలోచించి సెట్స్‌లోనే తీర అని క్యారెక్టర్‌కు పేరు మార్చారు.
– నరేశ్ కుప్పిలిగారు మంచి నెరేటర్. అయితే తను డెబ్యూ డైరెక్టర్ టేకింగ్ ఎలా ఉంటుందోనని అనుకునేదాన్ని. అయితే, కొన్నిరోజుల తర్వాత తను మూడు నాలుగు సినిమాల, అనుభవమున్న దర్శకుడిలా సినిమా చేస్తున్నాడని అర్థమైంది.
– నేను ఏ సినిమా చేస్తున్నా కూడా ఏదో అయిపోవాలని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోను. మంచి సినిమా చేస్తున్నాననే ఫీల్ అవుతాను. ఈ సినిమా కూడా అంతే. సినిమా బాగా వచ్చింది.
– విష్వక్ సేన్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. సెట్స్‌లో కూడా ఒకచోట ఉండడు. సినిమాలో విభాగాలపై తనకు మంచి అనుభవముంది. పాతికేళ్లకే తనలో మంచి పరిణితి కనిపిస్తుంది.
– ఇక నిర్మాతలు దిల్‌రాజుగారు, బెక్కెం వేణుగోపాల్‌గారు.. వీళ్ల గురించి చెప్పాలంటే దిల్‌రాజుగారి బ్యానర్‌లో ఎప్పటి నుంచి సినిమా చేయాలనుకుంటుంటే ఇప్పుడు కుదిరింది. అలాగే బెక్కెం వేణుగోపాల్‌గారైతే నెరేషన్ సమయం నుంచి తెలుసు. ఆయన కుటుంబ సభ్యులతోనూ మంచి అనుబంధం ఏర్పడింది.
– ప్రేమలో ఉన్నవారందరూ `పాగల్` సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇలాంటి స్క్రిప్ట్ రాయాలంటే దర్శకుడెంత పాగల్‌లా ప్యాషన్‌తో ఆలోచించి ఉంటాడో రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది.
– `అర్జున్ రెడ్డి` మ్యూజిక్ విన్నప్పటి నుంచి రధన్‌కు పెద్ద ఫ్యాన్‌గా మారాను. ఈ సినిమాకు తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది. ఇందులో ఆరేడు సాంగ్స్ ఉన్నాయి. అందులోసిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ నాకు బాగా నచ్చుతుంది.
– డిసెంబర్‌లో తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను.