Wednesday, January 22, 2025

ఆడ సింహం (LADY LION) క్రియేషన్స్ లోగో విడుదల

నవతరాన్నీ చైతన్య పరిచే దిశగా ఉద్భవిస్తున్న లేడీ లయన్ క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై భిన్నమైన చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత జి.ఆర్.జి.ఎన్ రాజు. సరికొత్తగా ఉద్బవిస్తున్న నిర్మాణ సంస్థ లేడీ లయన్ క్రియేషన్స్. సహా నిర్మాత గోవింద రాజులు. ఒకేసారి అనేక ప్రొడక్షన్సును రూపొందించడం అంటే అది సాధారణ విషయం కాదు. కచ్చితంగా అది ఒక అమోఘమైన ప్రయత్నం అని చెప్పాలి. అలాంటి గట్టి ప్రయత్నాన్ని మొదలెట్టింది లేడి లయన్ క్రియేషన్స్ బ్యానర్. లేడి లయన్ క్రియేషన్స్ బ్యానర్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమం సోమవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, రమేష్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు వీర శంకర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరికృష్ణ, మాదాల రవి, నాగబాల సురేష్ కుమార్ లతో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బ్యానర్ లోగో ను కె ఎస్ రామారావు విడుదల చేయగా, టీజర్ ను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు.

అనంతరం సీనియర్ నిర్మాత కె ఎస్ రామారావ్ మాట్లాడుతూ .. లేడి లయన్ అనే బ్యానర్ మొదలెట్టి నిర్మాత రాజు, దర్శకుడు చల్లా భాను కిరణ్ సరికొత్త తరహా చిత్రాలను నిర్మించేందుకు సిద్దమయ్యారు. సినిమా అంటేనే థియటర్స్ అనుభూతి. మనం ఎన్నో గొప్ప సినిమాలను, గొప్ప డైలాగ్స్, గొప్ప నటీనటులను తెరపై చూసేసాం. అలాంటి గొప్ప ఫీలింగ్ ఇచ్చే థియటర్స్ లోనే సినిమాలు విడుదల అవ్వాలి. ఈ మధ్య ఓటిటి అంటూ సినిమాలన్నీ అందులోనే విడుదల అవుతున్నాయి. కానీ నిజంగా సినిమా అనుభూతి థియటర్స్ లో తప్ప ఎందులో రాదు. కాబట్టి సినిమా థియేటర్స్ కోసం ఆ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయాలి అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ఆడ సింహం అంటూ అదిరిపోయే బ్యానర్ ని మొదలెట్టిన నిర్మాత రాజు గారికి, దర్శకుడు చల్లా భానులకు అభినందనలు. ఈ బ్యానర్ పై సరికొత్త తరహా చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇండస్ట్రీలో ఈ బ్యానర్ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేయాలనీ కోరుతున్నాను అన్నారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ .. సినిమా పరిశ్రమ గొప్పది. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అవకాశాలుగా మార్చుకుని ఎదుగుతుంది. అప్పట్లో సినిమాకు టివి పోటీగా ఉండేది. ఆ తరువాత ఇప్పుడు ఓటిటి అన్నది పోటీగా మారింది. నిజానికి ఓటిటి అన్నది చాలా మంచి అవకాశం. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేనుదుకు బాగా పనికివచ్చేది. ఓటిటి ద్వారా నిర్మాతలకు మరోఆదాయమార్గం అయింది. లేడీ లయన్ బ్యానర్ పై కొత్తతరహా సినిమాలు తీయాడానికి సిద్దమైన నిర్మాత రాజు, దర్శకుడు చల్లా భాను కిరణ్ లను అభినందిస్తున్నాను అన్నారు.

నిర్మాత రాజు మాట్లాడుతూ .. లేడి లయన్ బ్యానర్ పై సరికొత్త తరహా చిత్రాలు తెరకెక్కించే ఉద్దేశంతో ఈ బ్యానర్ ని మొదలెట్టాం. సినిమాలే కాకుండా ఓటిటి కోసం వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్నాం. చల్లా భాను కిరణ్ దర్శకత్వంలో మా ప్రయత్నంగా లవ్ యూ ఎనిమి అనే వెబ్ సిరీస్ త్వరలో విడుదల అవుతుంది అన్నారు.

చల్లా భాను కిరణ్ మాట్లాడుతూ .. రాజుగారు కొత్త టాలెంట్ ని పరిచయం చేసేందుకు ఈ బ్యానర్ ని మొదలెట్టారు. తప్పకుండా ఈ బ్యానర్ పై భిన్నమైన సినిమాలు వస్తాయి. ఈ లోగో లాంచ్ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాదాల రవి, రమేష్ ప్రసాద్, వీర శంకర్, లంక దాసరి ప్రసాద రావు ( మాజీ మున్సిపల్ చైర్మన్ గుడివాడ) తదితరులు చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x