పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఎలాంటి పేసరో అందరికీ తెలిపిందే. షోయబ్ 100 మీటర్ల వేగంతో విసిరే బంతులకు పెద్ద పెద్ద క్రికెటర్లే డంగైపోతారు. ఇదే విషయంపై ఇటీవల పాక్ ఫేమస్ యాక్టర్ ఫహద్ ముస్తఫా కొన్ని రోజుల క్రితం ఓ ఫన్నీ ట్వీట్ చేశాడు. ”అక్తర్ నీ వేగాన్ని తట్టుకోలేం.. దానికంటే ఇంట్లో ముసుగుతన్ని పడుకోవడం బెటర్” అంటూ కామెంట్ చేశాడు. దీనికి అక్తర్ కూడా తన స్టైల్లో ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. ”ఫహన్ నేను వేసిన 6 బంతులు ఆడు చాలు.. నీకు మోటార్ సైకిల్ కొనిస్తా” అంటూ ఛాలెంజ్ చేశాడు. అయితే అక్తర్ ట్వీట్‌పై ఫహద్ వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
కానీ తాజాగా అక్తర్ చాలెంజ్‌ను తాను ఒప్పుకుంటున్నానంటూ పాకిస్తాన్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ అధికారి సయ్యద్ జుల్ఫికర్ బుకారీ సవాల్ విసిరాడు. దీనికి సంబంధించి అక్తర్, బుకారీల మధ్య ట్విటర్‌లో ఆసక్తికర చర్చ నడిచింది. బుకారీ స్పందనపై అక్తర్ ఒక నిమిషం ఆలోచించి రీట్వీట్ చేశాడు. ”బుకారీ మీరు బాగానే ఉన్నారా.. నేను ఇచ్చిన చాలెంజ్ మీకు అర్థమైందా” అంటూ అడిగాడు.దానికి బుకారీ.. ”అక్తర్ నువ్వు ఇచ్చిన చాలెంజ్‌పై నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నా.. ఒకవేళ నేను ఒక్క బాల్ మిస్ అయినా.. ప్రతీ బంతి చొప్పున బైక్ ఇవ్వడానికి సిద్ధం” అని మరింత రెచ్చగొట్టాడు. దానికి అక్తర్ కూడా.. ‘బుకారీ.. నేను వేసే ఒక్కో బంతి మీ బ్యాట్‌ను తాకిన ప్రతీసారి ఒక్కో బైక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా.. మీరు సిద్ధమా” అంటూ ప్రతి సవాల్ విసిరాడు. అయితే అక్తర్ ట్వీట్‌పై బుకారీ నుంచి ఇంకా స్పందన రాలేదు. అయితే ఇలా వీరిద్దరి మధ్య జరిగిన ట్విటర్ వార్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆటకు దూరమైనా సోషల్ మీడియాలో ఇలా బోలెడు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంటాడు. ఆటలో ఎన్ని వివాదాలు వచ్చినా తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటాడు. క్రికెట్ చరిత్రలో గంటకు వంద మీటర్ల వేగంతో బంతులు విసరగల అతి కొద్ది మంది బౌలర్లలో అక్తర్ పేరు టాప్ 10లో ఉంటుంది. మరి చూడాలి అక్తర్-బుకారీ వార్ ముగిసినట్లేనా..? లేక నిజంగా బంతి, బ్యాట్ తీసుకుని బరిలోకి దిగుతారా..? అని.