కంటెంట్‌కు వెళ్లండి
21, సెప్టెంబర్ 2026, సోమవారం
English
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతం◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసం◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండి◆  సినీ సర్కార్‌కు స్వాగతం◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసం◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండి

'హతః' అధికారిక టీజర్ విడుదల: నిర్మాతగా కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం నిర్మాతగా, అనూష్ గొరక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ 'హతః' అధికారిక టీజర్ విడుదలైంది.

Cine Sarkar DeskRead in English
Share

కిరణ్ అబ్బవరం, వై.శివశంకర్ నాయుడు నిర్మాతలుగా KA ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రూపొందుతున్న చిత్రం ‘హతః’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, ఛాయాగ్రహణం అనూష్ గొరక్ నిర్వహించారు. కుష్లు మద్దాల, రెహమాన్, నమృత ఎంవీ, తనూజ పుట్టస్వామి ప్రధాన పాత్రధారులుగా నటించారు. సంగీతం జాసిన్ జార్జ్, ఎడిటింగ్ అఖిల్ చక్రవర్తి అందించారు.

సెప్టెంబర్ 18, 2026న విడుదలైన ఈ టీజర్‌లో కథాంశాన్ని ఎక్కడా వెల్లడించకుండా, రక్తసిక్త దృశ్యాలతో మిస్టీరియస్‌గా తెరకెక్కించారు. ‘Beyond Known’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం, ‘తిమ్మరాజుపల్లి TV’ తర్వాత కిరణ్ అబ్బవరం నిర్మాతగా చేస్తున్న రెండో చిత్రం. ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 6, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share