Thursday, December 26, 2024

క్రిస్మ‌స్ పండుగ‌ను త‌న‌ శైలిలో సెల‌బ్రేట్ చేస్తున్న శ్రుతీ హాస‌న్‌

స్టార్ హీరోయిన్ శ్రుతీ హాస‌న్ క్రిస్మ‌స్ సీజ‌న్‌ను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోవ‌టానికి సిద్ధ‌మైంది. ఈ సెల‌బ్రేష‌న్స్ ద్వారా కొత్త సంవ‌త్స‌రాదిని స‌రికొత్త ఉత్సుక‌త‌లో ప్రారంభించ‌టానికి ఆమె అడుగులు వేస్తున్నారు. క్రిస్మ‌స్ పండుగ‌ను శ్రుతీ హాస‌న్ త‌న‌దైన శైలిలో జ‌రుపుకోవ‌టానికి సెల‌బ్రేష‌న్స్‌ను మొద‌లు పెట్టింది. అందులో భాగంగా గోత్ థీమ్‌తో క్రిస్మ‌స్‌ను సెల‌బ్రేట్ చేయ‌టానికి త‌న స్టైల్‌ను జోడించింది.

శ్రుతీ హాస‌న్, త‌న‌దైన స్టైల్లో యూనిక్‌గా నిర్వ‌హిస్తోన్న‌ క్రిస్మ‌స్ పండుగ వేడుక‌లకు సంబంధించిన ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌త్యేక‌మైన శైలిలో హాలీడే సీజ‌న్‌కు స్వాగ‌తం ప‌లుకుతూ ఆమె అభిమానులు స‌హా అందిర‌లోనూ ఆనందాన్ని నింపింది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే 2023 శ్రుతీ హాస‌న్ కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ ఏడాదిగా చెప్పొచ్చు. వాల్తేరు వీర‌య్య‌, వీర సింహారెడ్డి, స‌లార్ పార్ట్ 1 చిత్రాలు విడుద‌లై ఘ‌న విజ‌యాల‌ను సాధించాయి.కానీ ఈ ఏడాది మాత్రం ఆమె న‌టించిన సినిమాలేవీ విడుద‌ల కాలేదు. అయితే అభిమానులు మాత్రం 2025లో స‌రికొత్త చిత్రాల్లో ఆమెను చూడొచ్చు. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న క్రేజీ  పాన్ ఇండియా మూవీ కూలీ వ‌చ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌కుడు. అలాగే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న స‌లార్ 2 చిత్రం కూడా వ‌చ్చే ఏడాదిలో సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం.

ఇవి కాకుండా మ‌రిన్న క్రేజీ చిత్రాల్లో శ్రుతీ హాస‌న్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. రానున్న రోజుల్లో ఆమె త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో అభిమానులు స‌హా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x