ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ వార్తల్లోకెక్కాడు. అద్భుతమైన ఫీల్డర్‌గా పేరున్నా.. ఏకంగా ఇద్దరు డేంజరస్ బ్యాట్స్‌మన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌లను వదిలేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే క్యాచ్‌లను వదిలేయడంతో పాటు మైదానంలోనే ధవన్, నటరాజన్‌లకు మోకాళ్లపై వంగి నమస్కారం చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇన్నింగ్స్ అయిదో ఓవర్లోనే భువీ బౌలింగ్‌లో స్టోక్స్ భారీ సిక్స్ బాదేందుకు ప్రయత్నించాడు. కానీ షాట్ సరిగా తగలకపోవడంతో ఆ బంతి నేరుగా లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ వైపుగా వెళ్లింది. అత్యంత సులభమైన ఆ క్యాచ్‌ను పాండ్యా అందుకోలేకపోయాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లే కాకుండా, అభిమానులు కూడా షాకయ్యారు.
అలాగే 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శామ్ కర్రాన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను సైతం హార్దిక్ పట్టుకోలేకపోయాడు. 22 పరుగుల వద్ద ఉన్నపుడు ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ప్రసిద్ధ్ బౌలింగ్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దీంతో మ్యాచ్ చివరి వరకు అతడెంత విధ్వంసం సృష్టించాడో వేరే చెప్పక్కర్లేదు. టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నంత పని చేశాడు. 83 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివర్లో నటరాజన్ పొదుపుగా బౌలింగ్ చేయకపోతే టీమిండియా ఓడినా ఆశ్చర్యం కలిగేది కాదు.
కాగా.. స్టోక్స్ క్యాచ్‌ను హార్దిక్ వదిలిన కొద్ది ఓవర్లలోనే.. నటరాజన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన నటరాజన్ షార్ట్ పిచ్ డెలివరీనీ సంధించాడు. దానిని బౌండరీ కోసం పుల్ చేసిన స్టోక్స్.. థర్డ్ మ్యాన్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ధవన్‌ను చిక్కాడు. అయితే ధవన్ ఏలాంటి తప్పూ చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో హార్దిక్ తెగ ఆనందపడిపోయాడు. తాను చేసిన తప్పును సరిదిద్దడమే కాకుండా ఓ డేంజరస్ బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసినందుకు గానూ వారిద్దరికీ థాంక్స్ చెప్పాడు. మైదానంలోనే మోకరిల్లి బౌలర్ నటరాజన్‌కు, క్యాచ్ అందుకున్న ధవన్‌కు దండాలు పెడుతూ, తలను నేలకు తాకించి నమస్కారం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.