గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొనసాగించిన ఫామ్‌నే ఈ ఏడాది కూడా ధవన్ కొనసాగిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. 49 బంతుల్లో 92 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ జట్టు గెలవడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం సహచర ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌తో సరదా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తన ఇన్నింగ్స్ గురించి, తన ఫామ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
కాగా.. పేస్ బౌలింగ్‌లో అవలీలగా స్వీప్ షాట్లు ఎలా ఆడుతున్నావని అశ్విన్ అడగ్గా.. ‘నాకు తెలుసు. పేసర్లు యార్కర్లు, ఆఫ్ సైడ్ యార్కర్లు వేసి ఫీల్డింగ్ సెట్ చేస్తున్నారు. ఇలా చేస్తే నా ట్రేడ్ మార్క్ షాట్ అయిన ఆఫ్ సైడ్ బౌండరీ కష్టంమవతుంది. నేను దాంతో పేస్‌ను ఉపయోగించుకుని స్వీప్ షాట్లు ఆడుతున్నా. ఆ తరహా షాట్లను ఎంజాయ్ చేస్తున్నా. దానివల్ల బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. నెట్స్‌లో ఎక్కువ అదే ప్రాక్టీస్ చేస్తుడడంతో ఫీల్డ్‌లో సక్సెస్ అవుతున్నాన’ని ధవన్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 18.2 ఓవర్లలోనే ఈజీగా ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 49 బంతుల్లోనే 92 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. తమ ఓటమికి శిఖర్ ధవన్ ఇన్నింగ్స్ కారణమని పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా చెప్పాడంటే ధవన్ ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో చెప్పవచ్చు. ఇక ధవన్ దంచుడుతో పంజాబ్ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్(69), కేఎల్ రాహుల్(61) అర్థ సెంచరీలో రాణించినా వృథా అయింది. అంతేకాకుండా ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‌కు చేరింది. పంజాబ్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో కేవలం ఒక్క విజయంతో ఏడో స్థానానికి పడిపోయింది.