Friday, November 1, 2024

శ్రీలంక క్రికెటర్‌పై 8 ఏళ్ల నిషేధం.. కారణం విధించిన ఐసీసీ

ఇంతకుముందుతో పోల్చితే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇటీవలి కాలంలో ఆటగాళ్లు చేసే తప్పులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. క్రమశిక్షణ చర్యల కింద భారీ జరిమానాలే కాదు.. ఏకంగా నిషేధాలు కూడా విధిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంకకు చెందిన క్రికెటర్ దిల్హరా లోకుహెట్టిగేపై ఐసీసీ ఏకంగా 8 ఏళ్ల నిషేధం విధించింది. అవినీతి ఆరోపణలు, ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. 3 ఏప్రిల్ 2019 నుంచి లోకుహెట్టిగేపై నిషేధం అమలులోకి తీసుకుంటున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన దిల్హారా లోకుహెట్టిగే క్రికెట్ ఆడుతూ అవినీతి, ఫిక్సింగ్‌లకు పాల్పడినట్లు అవినీతి నిరోధక విభాగం అధికారులు గుర్తించారు. ఐసీసీ ఆర్టికల్ 2.1.1 – ఫిక్సింగ్ చేయడానికి సహకరించడం, ఫిక్సింగ్‌కు పాల్పడటం, మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి అంగీకరించడం లాంటి తప్పిదాలకు లోకుహెట్టిగే పాల్పడినట్లు ఐసీసీ యాంటీ కరప్షన్ విభాగం వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడిపై 8 ఏళ్ల నిషేధం విధించినట్లు తెలిపింది.


కాగా.. ఐసీసీ నిర్ణయంతో లోకుహెట్టిగే ఎనిమిదేళ్లపాటు అఫీషియల్ క్రికెట్ ఆడడానికి దూరం కానున్నాడు. శ్రీలంక తరపున ఏ ఫార్మాట్లోనూ బరిలోకి దిగకూడదు. అయితే ఇప్పటికే 40 ఏళ్ల వయసు కలిగిన లోకు హెట్టిగే ఇకపై జట్టు తరపున మరో మ్యాచ్ ఆడే అవకాశం కూడా లేదు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x