Sunday, March 22, 2026

అశ్విన్ ఇంట్లో 10 మందికి కరోనా.. భార్య ఎమోషనల్ ట్వీట్

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. లక్షల మందిని కబళిస్తూ.. వేల మందిని ప్రాణాలు బలిగొంటూ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యులు, సినిమా స్టార్లు, క్రికెట్లు అనే తేడా లేకుండా అందరినీ ఈ మహమ్మారి బాధిస్తోంది. ఈ క్రమంలోనే అనేకమంది క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే భారత సీనియర్ స్పిన్నర్‌, ఆల్‌ రౌండర్‌ అశ్విన్‌ కుటుంబంలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. అశ్విన్ ఇంట్లో ఏకంగా 10మందిని ఈ మహమ్మారి కబళించింది. ఈ విషయాన్ని అశ్విన్‌ భార్య ప్రీతి నారాయణన్‌.. సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. అశ్విన్‌ కుటుంబ సభ్యులు శుక్రవారం కోవిడ్‌ పరీక్షలు చేసుకోగా.. పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు ప్రీతి ట్వీట్‌ చేశారు.

ప్రీతి తన ట్వీట్‌లో.. ‘మా ఇంట్లో ఉన్న పది మంది కరోనా బారినపడ్డారు. ఆరుగురు పెద్దలు, నలుగురు పిల్లలు. పిల్లల కారణంగా అందరికీ ఈ మహమ్మారి వ్యాపించింది. ప్రస్తుతం కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో, ఆసుపత్రుల్లో చేరడంతో గతవారం మా కుటుంబానికి ఓ పీడకలలా గడిచింది. 5-8 రోజులు చాలా కష్టంగా గడిచాయి. సాయం చేయడానికి అందరూ ఉ‍న్నా.. చేయలేని పరిస్థితి. ఇది నిజంగా మాయదారి వైరస్‌. మానసిక ఆరోగ్యం కంటే శారీరక ఆరోగ్యం ద్వారానే వేగంగా కోలుకోగలమని భావిస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోండి, టీకాతోనే మనం ,మన కుటుంబ సభ్యులు ఈ మహమ్మారితో పోరాడగలం’ అని పేర్కొన్నారు.


ఇదిలా ఉండగా.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలో ఉన్న అశ్విన్‌ గతవారం సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. తన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారని, వారికి అండగా ఉండేందుకే తాను ఐపీఎల్‌ను వీడాల్సి వస్తోందని అశ్విన్ ట్విటర్ ద్వారానే ఈ విషయాన్ని వెల్లడించాడు. దీంతో కరోనా కారణంగా ఈ సీజన్‌లో లీగ్‌ నుంచి తప్పుకున్న తొలి భారతీయ క్రికెటర్‌‌గా అశ్విన్‌ నిలిచాడు. అశ్విన్‌తో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అనేకమంది విదేశీ ఆటగాళ్లు కూడా కరోనా కారణంగా ఈ లీగ్ నుంచి తప్పుకున్నారు. ఇద్దరు అంపైర్లు కూడా ఐపీఎల్ నుంచి వైదొలిగారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -