టీమిండియా బ్యాట్స్‌మెన్ టెస్టుల్లో పెర్ఫార్మెన్స్‌తో అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటికే కోహ్లీ టాప్ 5లో ఉన్నాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ కూడా టాప్ 7లో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా టాప్ 7లో స్థానం సంపాదించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ తన కెరీర్ బెస్ట్ టాప్ 7 ర్యాంక్ సాధించాడు.
ఇప్పటికే ఆ స్థానంలో ఉన్న రోహిత్ శర్మతో పాటు ఆ స్థానాన్ని పంచుకున్నాడు. మొత్తంగా 747 పాయింట్లతో ఉన్న పంత్.. ఇన్ని పాయింట్లు సాధించిన ఏకైక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతేకాకుండా భారత బ్యాట్స్‌మెన్‌లలో ఇన్ని పాయింట్లు సాధించిన 15వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఓపెనర్ రోహిత్ కూడా 747 సాధించి ఏడో స్థానంలో నిలిచాడు.
ఐసీసీ ర్యాకింగ్స్ పట్టికలో న్యూజిల్యాండ్ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో నెంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్, బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత ఆసీస్ బ్యాట్స్‌మన్ లబుషేన్ 878 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. టీమిండియా కెప్టెన్, బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ 814 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక ఆరో స్థానంలో 760 పాయింట్లతో పాకిస్తాన్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ బాబర్ అజాం నిలిచాడు.