Saturday, March 21, 2026

భర్తను చంపి దారుణంగా ఇంట్లోనే.. వామ్మో ఈమె నిజంగా రాక్షసే..

హైదరాబాద్‌లో తాజాగా ఓ దారుణ ఘటన జరిగింది. ఓ భార్య తన భర్తను చంపేసింది. అంతేకాదు ఏకంగా ఇంట్లోనే పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్లు పోలీసుల వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. గగన్ రెండేళ్ల క్రితం తన మొదటి భార్యకు విడాకులిచ్చి గత జూన్‌‌లో నౌసిన్‌ బేగంను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత మన్సురాబాద్‌లోని అగర్వాల్ ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటున్నారని ఆయన తెలిపారు. ఇన్నాళ్లుగా సాఫీగానే సాగుతోంది. కుటుంబ సభ్యులతో కూడా అంతగా వివాదాలు లేవు. కానీ వారిద్దరి మధ్య ఏ వివాదం తలెత్తిందో ఏమో కానీ.. ఆమే స్వయంగా తన భర్తను చంపేసింది. గుట్టుచప్పుడు కాకుండా భర్తను హతమార్చడమే కాకుండా.. ఇంట్లోనే అతడిని పూడ్చిపెట్టినట్లు వెల్లడైందని పోలీసులు చెబుుతున్నారు. విచారణలో ఈ విషయం బయటపడడంతో పోలీసులు కూడా నిర్ఘాంతపోయారు. వెంటనే గగన్‌ రెండో భార్య నౌసిన్‌ను‌ అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన మరి కొన్ని వివరాలు బయటకు రావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో నౌసిన్‌ ఎల్బీ నగర్‌ పోలీస్టేషన్‌కు వచ్చింది. తన భర్త పేరు గగన్‌ అగర్వాల్‌(38) అని, అతడు చాలా రోజులుగా కనపడడం లేదని ఫిర్యాదు చేసింది. ఆమెతో పాటు గగన్‌ సోదరుడు కూడా పోలీసుల వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో అనేక షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.

ఈ కేసులో గగన్ అగర్వాల్ రెండో భార్య నౌసియా బేగం పోలీసులను మొదట తప్పుదోవ పట్టించిందన్నారు. గగన్ అగర్వాల్ భార్య నౌసియా బేగం‌పై అనుమానంతో దర్యాప్తు చేశామని ఆయన పేర్కొన్నారు. అగర్వాల్‌ను తానే కత్తితో హత్య చేసి ఇంటి వెనుకాల పూడ్చి పెట్టినట్టు విచారణలో నౌసియా బేగం ఒప్పుకుందని ఏసీపీ తెలిపారు. దీంతో ఇంట్లో ఉన్న అగర్వాల్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు. నౌసియా బేగానికి గతంలో జరిగిన మొదటి పెళ్లితో ఆమెకు నలుగురు కూతుర్లు ఉన్నారన్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -