ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో భాగంగా శుక్రవారం మహమ్మదీన్ స్పోర్టింగ్ క్లబ్-అబహానీ లిమిటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. షకీబ్ బౌలింగ్ వేసిన వెంటనే ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన షకీబల్ వికెట్లను బలంగా తన్ని అంపైర్‌పైకి దూసుకెళ్లాడు. అలాగే ఆ తర్వాతి ఓవర్లో వర్షం పడడంతో 5.5 ఓవర్ల వద్ద మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించడంపై కూడా షకిబ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాన్ స్ట్రేకర్‌లో ఉన్న వికెట్లను పెకలించి కింద విసిరికొట్టాడు. షకీబల్ చేసిన ఈ పని క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరో బంతి వేసి ఉంటే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఫలితం తేలే అవకాశం ఉండేదని, బంతి వేసే అవకాశం ఉన్నా మ్యాచ్‌ను ఆపేసారని ఆరోపిస్తూ వికెట్లను బలంగా పీకేసి విసిరిపడేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కాగా.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌ను అతడి భార్య ఉమ్మీ అల్ హసన్ వెనకేసుకొచ్చింది. తన భర్త చాలా మంచోడని, అతడిని విలన్‌ని చేయాలని చూస్తున్నారని మండిపడింది. అందుకనుగుణంగా భర్తను సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. అంపైర్ నిర్ణయంపై తనకు కూడా అనుమానం ఉందన్న ఆమె.. తన భర్తపై కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. ఘటనకు మరోవైపు మాత్రమే చూపించి అసలు విషయాన్ని దాచిపెడుతున్నారని విమర్శించింది.
Genuinely unbelievable scenes…
Shakib Al Hasan completely loses it – not once, but twice!
Wait for when he pulls the stumps out 🙈 pic.twitter.com/C693fmsLKv
— 7Cricket (@7Cricket) June 11, 2021
ఈ ఘటనపై మీడియా కంటే తానే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నానని, ఈ ఘటనలో నిజానిజాలేంటో తెలిసిన కొందరైనా అతడికి మద్దతుగా ఉన్నారని పేర్కొంది. ఈ ఘటనలో అసలు సమస్య అంపైర్ల తప్పుడు నిర్ణయాలు దానిని సమాధి చేసి, కావాలని కక్షపూరితంగా షకీబ్‌ను విలన్‌ను చేసి చూపిస్తున్నారని ఉమ్మీ ఆరోపణలు చేసింది. కాగా.. తాజా సమాచారం ప్రకారం.. షకిబ్ ప్రవర్తనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు చేసిన తప్పుకు శిక్షగా 3 మ్యాచ్‌ల నిషేధం విధించింది.