Sunday, March 22, 2026

అల్లు పాటకు వార్నర్ డాన్స్.. వైఫ్ ట్రోల్

కరోనా తొలి వేవ్‌ సమయంలో ఆస్ట్రేలియాలో లాక్‌డౌన్‌ విధించారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ తన కుటుంబంతో కలిసి టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఇలా సోషల్ మీడియా మొత్తం తానే కనిపించాడు. పలు సినిమాల్లోని పాటలు, డైలాగ్స్‌, డ్యాన్సులతో అభిమానులను అలరించాడు. ముఖ్యంగా ఇండియన్‌ సినిమాలంటే విపరీతమైన అభిమానం ఉన్న వార్నర్‌.. షారుక్‌ ఖాన్‌, ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌, విజయ్‌లను ఇమిటేట్‌ చేస్తూ అదరగొట్టాడు.

భారత్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆసీస్ ఆటగాళ్లు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆ దేశంలో నిబంధనల ప్రకారం.. మొదటగా మాల్దీవులు వెళ్లి అక్కడి నుంచి ఆసీస్ వెళ్లారు. అయితే అక్కడకు చేరుకున్నా.. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిబంధన ఉండడంతో.. ప్రస్తుతం వార్నర్ సిడ్నీలోని ఒక హోటల్‌లో సహచర ఆటగాళ్లతో కలిసి క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే వార్నర్‌కు క్వారంటైన్‌ పీరియడ్‌‌లోనూ గతేడాది లానే మళ్లీ అలరిస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్‌ అల వైకుంఠపురం సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ రాములో రాములా పాటకు స్టెప్పులు వేశాడు. అల్లు అర్జున్‌ స్థానంలో తన ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి వీడియోను రిలీజ్‌ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వార్నర్‌ పెట్టిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై వార్నర్‌ భార్య కాండీ భర్తను ట్రోల్‌ చేయడం విశేషం. ‘‘ఏంటీ? క్వారంటైన్‌ బోర్‌ కొడుతుందా.. వీడియోల మీద వీడియోలు చేస్తున్నావు’’ అంటూ ఆమె ట్రోల్‌ చేసింది. ‘‘క్యాండీ.. నేను లేనని సంతోషపడుతున్నావు కదా. నా 14 రోజుల క్వారంటైన్‌ త్వరలోనే ముగుస్తుంది. నా టార్చర్‌ భరించేందుకు రెడీగా ఉండు’’ వార్నర్ ఓ క్యూట్ రిప్లై ఇచ్చాడు. దీంతో వార్నర్ పాటతో పాటు వీరిద్దరి ట్వీటర్ క్యూట్ వార్ కూడా వైరల్ అవుతోంది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -