Sunday, March 22, 2026

ఐపీఎల్ వాయిదాతో బుమ్రా కపుల్ హ్యాపీ.. ఫోటో షేర్ చేసి మరీ..

కరోనా వల్ల ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా నిలిచిపోయింది. అత్యంత పటిష్ఠంగా బయోబబుల్ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో విదేశీ ఆటగాళ్లంతా తమ దేశాలకు వెళ్లిపోయారు. స్వదేశీ ఆటగాళ్లు కూడా తమ ఇళ్లకు వచ్చేశారు. అయితే ఇలా ఇంటికి చేరుకున్న వారిలో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా బుమ్రాతో కలిసి ఆనందంగా ఉన్న ఫోటోను సంజన గణేషన్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. అంతేకాదు.. ఆ ఫోటోకు ‘హోం’ ఎమోజీని జత చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనను బుమ్రా మార్చిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో సిరీస్ నుంచి సెలవు తీసుకుని మరీ బుమ్రా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఐపీఎల్ లీగ్‌ మొదలు కావడంతో బుమ్రా బయోబబుల్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో వీరిద్దరికీ కలిసి ఉండేందుకు అంత సమయం దక్కలేదు. కానీ కరోనా దెబ్బకు ఐపీఎల్‌ మధ్యలోనే వాయిదా పడడంతో బుమ్రా ఇంటికి వెళ్లిపోయాడు. వివాహం అనంతరం మళ్లీ ఇప్పుడు కలిసిన బుమ్రా, సంజనల జంట వాళ్ల ఇంట్లో సంతోషంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగానే బుమ్రాతో కలిసి ఆనందంగా ఉన్న ఫోటోను సంజన పోస్ట్‌ చేసింది. ఆ ఫోటోలో సంజన ఆనందంగా నవ్వుతూ భర్తను హత్తుకుని ఉంది.

కాగా.. ఐపీఎల్‌లో ఉన్న సమయంలోనే ఈ వారం ప్రారంభంలో బుమ్రా సంజనకు పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పాడు. ఆ పోస్ట్‌లో సంజనపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. అందులో.. ‘రోజూ నా హృదయాన్ని దొంగిలించే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను నిన్ను ప్రేమిస్తునే ఉంటాను’ అంటూ తన స్టైల్లో కవిత్వంతో సంజన మనసును మరోసారి దోచేశాడు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -