ప్రపంచ క్రికెట్‌లో పరిపూర్ణ ఫాస్ట్ బౌలర్‌గా భారత పేసర్ బుమ్రాకు ఎంతో గుర్తింపు ఉంది. ఎప్పుడు ఎలాంటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని బోల్తా కొట్టించాలో బుమ్రాకు బాగా తెలుసు. ఆ టాలెంట్‌తోనే ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ను సైతం వణికిస్తూ.. వరల్డ్ బెస్ట్ బౌలర్ అనిపించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు బుమ్రాకంటే మరో బెస్ట్ బౌలర్ టీమిండియాకు దొరికాడట. ఈ మాట అంటోంది కూడా టీమిండియా మాజీ పేసర్ కావడం చర్చనీయాంశమవుతోంది. బుమ్రా గొప్ప బౌలరేనని, అందులో సందేహం లేదని, అయితే ఇప్పుడు అంతకంటే గొప్ప బౌలర్ టీమిండియాకు దొరికాడని సదరు మాజీ పేసర్ అనడం సంచలనంగా మారింది. దీంతో అంత గొప్ప పేసర్ ఎవరా అని నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.
టీమిండియా మాజీ పేసర్ ఆశిశ్ నెహ్రా ఇటీవల ఓ క్రికెట్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆ సందర్భంగానే టీమిండియా బెస్ట్ పేసర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం చెప్పాడు. మూడు-నాలుగేళ్లుగా టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా గురించే ఎక్కువగా వినిపిస్తోందని, అతడు బెస్ట్ బౌలర్ అని అందులో సందేహం లేదని నెహ్రా అన్నాడు. కానీ ఇప్పుడు బుమ్రాకు ఏ మాత్రం తీసిపోని మరో బౌలర్ టీమిండియాకు దొరికాడని, అతడే మహ్మద్ సిరాజ్ అని నెహ్రా చెప్పుకొచ్చాడు. ‘స్కిల్స్ ప్రకారం చూస్తే బుమ్రా కంటే మహ్మద్ సిరాజ్ తక్కువ కాదు. బుమ్రాకు ఎంతమాత్రం తీసిపోడు. నా దృష్టిలో స్కిల్స్‌లో బుమ్రా కంటే సిరాజే గొప్ప పేసర్ అనుకుంటున్నా. అన్ని ఫార్మాట్లలోనూ గొప్ప ప్రభావం చూపగలిగే బౌలర్ సిరాజ్ అని నేను చెప్పగలను. అతడికి ఆ సామర్థ్యం ఉందని కచ్చితంగా నమ్ముతున్నా’ అంటూ నెహ్రా పేర్కొన్నాడు.
సిరాజ్ ఇలాగే కొనసాగాలంటే ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యమని, అదే అతడిని తాను కోరుతున్నానని నెహ్రా చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం సిరాజ్‌కు గురించి మాట్లాడుకున్నామని, భారత్-ఎ జట్టుకు ఆడేటప్పుడు అతడు గొప్ప బౌలర్ అని నెహ్రా తెలిపాడు. ఇదిలా ఉండగా.. ప్రపంచ క్రికెట్లో టెస్టుల్లో అతి వేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్ బుమ్రా తన పేరిట రికార్డును లిఖించుకున్నాడు. మరి నెహ్రా వ్యాఖ్యలను బట్టి చూస్తే సిరాజ్ అతడిని దాటేస్తాడేమో చూడాలి. అప్పుడు అతడు కచ్చితంగా బుమ్రాను మించిన బౌలరే అవుతాడు. కాగా.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తుండగా, ఆర్సీబీ తరఫున సిరాజ్ ఆడుతున్నాడు.