Thursday, November 21, 2024

‘మాది కాలుష్యం.. నీది కాదా..?’ బుమ్రా పెళ్లి ఫోటోపై నెటిజన్ల ఆగ్రహం..

బుమ్రా ఎవరికీ చెప్పకుండా ఉన్నట్లుండి పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. ఈ నెల 15న స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజన గణేశన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గోవాలో ఈ వేడుక జరిగింది. పెళ్లి తంతు మొత్తం పూర్తయిన తరువాత వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రెండు రోజుల నుంచి షేర్ చేస్తున్న ఈ ఫోటోలు షేర్ చేస్తున్నా.. తాజాగా అతడు షేర్ చేసిన ఓ ఫోటోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవ దంపతులు బుమ్రా, సంజన మధ్యలో నడుచుకుంటూ వస్తుంటే పక్కన బంధువులు బాణసంచా కాలుస్తుండడం ఆ ఫోటోలో ఉంది. ఈ ఫోటోపైనే నెటిజన్లలో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. దీనికి కారణం బుమ్రా 2017లో చేసిన ఓ ట్వీట్. దీపావళిని పురస్కరించుకుని బుమ్రా చేసిన ఆ ట్వీట్‌లో.. ‘హ్యాపీ దీపావళి. ప్రశాంతంగా, హాయిగా పండుగ జరుపుకోండి’ అని ‘#saynotocrackers అనే హ్యాష్‌ల్యాగ్‌తో షేర్ చేశాడు. ఈ ట్వీట్‌నే నెటిజన్లు ఇప్పుడు మండిపడుతున్నారు.

దీనిపై అనేకమంది నెటిజన్లు రకరకరాలుగా స్పందిస్తున్నాడు. ‘నీవు చేస్తే కాలుష్యం కాదు, మేము చేస్తే కాలుష్యం ఎలా అవుతుంది..?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మొదట నీవు పాటించు. ఆ తర్వాత మాకు చెప్పు’, ‘భాయ్‌.. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు’ ‘నీవు కాలిస్తే కాలుష్యం కాదు. మేం కాలిస్తే మాత్రం కాలుష్యం.. ఇదెక్కడి న్యాయం..?’ అంటూ కౌంటర్లిస్తున్నారు.

ఇదిలా ఉంటే బుమ్రా గత నెల ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌లో కూడా బుమ్రా ఆడడం లేదు. రాబోయే వన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో కూడా బుమ్రా పేరు లేదు. దీంతో బుమ్రా నేరుగా ఐపీఎల్‌కే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా కనపడనున్నాడు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x