Sunday, March 22, 2026

వామ్మో ఈ వయసులో కూడా ఇలానా..? తాహిర్ చేసిన రనౌట్‌పై నెటిజన్స్ షాక్

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసందే. ఈ ఓటమితో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది. ఈ సీజన్లోనే మరే జట్టూ సాధించనంత తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై విజయంలో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. అటు బ్యాటింగ్‌లో అజేయ అర్థ సెంచరీతో రాణించడంతో పాటు.. బౌలింగ్‌లో కూడా 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. జడేజా సూపర్ షోతో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది. ఈ విజయం గురించి అటుంచితే.. ఈ మ్యాచ్‌లో చెన్నై వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్.. చేసిన ఓ రనౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 14వ సీజన్లో ఈ రోజు(ఆదివారం) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో తాహిర్‌ తొలిసారిగా తుది జట్టులో స్థానం సంపాదించాడు. కాగా ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ చివరి బంతిని జేమిసన్‌ స్వేర్‌లెగ్‌ దిశగా ఆడి రన్‌కు ప్రయత్నించాడు. కానీ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉ‍న్న చాహల్‌.. వద్దని వారించాడు. ఇంతలో జేమీసన్ కొంత దూరం వచ్చేయడంతో తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న తాహిర్ బంతిని అందుకుని వికెట్లకు విసిరాడు. తాహిర్‌ విసిరిన బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో జేమిసన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

తాహిర్‌ చేసిన ఆ రనౌట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై ఫిదా అవుతున్నారు. విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ‘తాహిర్‌ వచ్చీ రావడంతోనే ఇరగదీశావ్‌.. ఈ వయసులోనూ సూపర్‌ డైరెక్ట్‌ త్రో..” అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక బౌలింగ్‌లోనూ తాహిర్‌ మెరిశాడు. 4 ఓవర్లు వేసి 16 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు కూడా తీశాడు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -