Sunday, March 22, 2026

తప్పులో కాలేసిన మయాంక్.. బుమ్రా భార్యకు బదులు..

టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా, టీవీ ప్రజెంటర్ సంజనా గణేషన్ సోమవారం ఒక్కటైన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం గురించి బుమ్రా కానీ, సంజన కానీ ఎక్కడా బయటకు రాకుండా సీక్రెట్‌గా మెయింటెయిన్ చేశారు. అయితే ఉన్నట్లుండి గోవాలో వివాహం చేసుకుని ఒక్కటవ్వడంతో క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే వీరిద్దరూ ఒక్కటవ్వడంపై మాత్రం శుభాకాంక్షలు చెబుతూ విష్ చేస్తున్నారు. పలువురు క్రికెటర్లు కూడా బుమ్రాను సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు.

టీమిండియా ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌.. బుమ్రా, సంజనలకు కంగ్రాట్స్‌ చెబుతూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్‌లో మయాంక్ చేసిన ఓ తప్పుతో క్రికెట్ ఫాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. అయితే మయాంక్ తన ట్వీట్‌లో బుమ్రా భార్య సంజన పేరుకు బదులుగా టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్‌ బంగర్‌ పేరును ట్యాగ్‌ చేశాడు. ”కంగ్రాట్స్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. సంజయ్‌ బంగర్‌.. మీ వైవాహిక జీవితం బాగుండాలని.. కలకాలం సంతోషంతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా” అంటూ కామెంట్‌ చేశాడు. మయాంక్‌ చేసిన పని నెటిజన్లకు మొదట అర్థం కాకపోయినా.. ఆ తరువాత విషయం తెలిసి తెగ నవ్వుకుంటున్నారు.


‘అయ్యో మయాంక్‌.. బుమ్రా భార్య పేరు సంజన, సంజయ్‌ బంగర్‌ కాదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. మరో నెటిజన్..‘ఇప్పుడే బుమ్రా.. సంజనను పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ సంజయ్ బంగర్‌తో పెళ్లంటే కష్టం’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. కొంత సేపటికి మయాంక్‌ తాను చేసిన తప్పును తెలుసుకుని.. ఆ ట్వీట్‌ను చూసుకొని వెంటనే దానిని డిలీట్‌ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక మయాంక్ గురించి పక్కన పెడితే.. బుమ్రాకు టీమిండిమా మాజీలు బుమ్రాకు విరాట్‌ కోహ్లీ, యువరాజ్‌, హర్భజన్‌, కేఎల్‌ రాహుల్‌, చతేశ్వర్‌ పుజారా సహా పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -