తొలి టీ20 తుది జట్టు ఎంపిక విషయంలో కోహ్లీ పెద్ద తప్పు చేశాడంటూ కోహ్లీపై సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. ప్రధానంగా రోహిత్‌ను పక్కన పెట్టడం పరమ చెత్త నిర్ణయమని విమర్శించాడు. కానీ రెండో టీ20లో కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సెహ్వాగ్ మొన్నటి విమర్శలను పక్కన పెట్టి ఆకాశానికెత్తేశాడు. అంతటితో ఆగకుండా మ్యాచ్‌ను ముగించడంలో కోహ్లీ బెస్ట్ అని, దిగ్గజ ఆటగాడు సచిన్‌తో కోహ్లీ సరిసమానమని అభినందించాడు. ఈ విషయంలో యువ క్రికెటర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లు కోహ్లిని ఆదర్శంగా తీసుకోవాలని సూచనలు చేశాడు.
అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్(32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టే ప్రదర్శన చేసినా, కోహ్లిలా ఆఖరి దాకా క్రీజ్‌లో ఉండలేకపోయాడని, ఈ విషయంలో కోహ్లీ సలహాలు తీసుకోవాలని సూచనలు చేశాడు. అలాగే రిషబ్ పంత్(13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడని, కానీ కోహ్లీలా జట్టును గెలిపించే సత్తా పొందాలంటే మరింత శ్రమించాలని అన్నాడు. జట్టును గెలిపించాలనే తపన కోహ్లీలో నరనరానా ఉంటుందని, యువ క్రికెటర్లలు కూడా అలాంటి ఆలోచనను పెంచుకోవాలని సలహా ఇచ్చాడు.
ఆసీస్, ఇంగ్లండ్ సిరీస్‌లలో వరుస వైఫల్యాలతో విరాట్ కోహ్లీ సతమతమయ్యాడని, కానీ తాజా ఇన్నింగ్స్ ఊరట కలిగించి ఉంటుదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో సైతం అంతగా ఆకట్టుకోని కోహ్లి రెండో టీ20లో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి యువ క్రికెటర్లకు మార్గదర్శిగా నిలిచాడని సెహ్వాగ్ కితాబునిచ్చాడు.