Thursday, April 3, 2025

‘కుక్క’ గొడవ.. డీఎన్‌ఏ పరీక్షలతో న్యాయం

ఇద్దరు వ్యక్తులు ఓ కుక్కకోసం గొడవ పడి పోలీసులను ఆశ్రయించారు. వారి గొడవ చూసిన పోలీసులు చివరకు కుక్కకు డీఎన్‌ఏ టెస్టులు చేయించి దాని అసలు యజమానికి ఆ కుక్కను అప్పగించారు. ఆశ్చర్యం కలిగించినా.. ఇది నిజం. మధ్యప్రదేశ్‌కు చెందిన కార్తీక్ శివహరే, షాదాబ్ ఖాన్‌ల మధ్య ఓ లాబ్రడార్ కుక్క కోసం పెద్ద గొడవ జరిగింది. ఆ కుక్క తనదంటే తనదంటూ వాదించుకున్నారు. వారి పంచాయతీ చిరవకు పోలీసుల వద్దకు వెళ్లింది. వారిద్దరి మధ్య వివాదం తెలుసుకున్న పోలీసులు కూడా మొదట షాక్ తిన్నా చివరికి ఆ కేసు పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులకు కూడా ఆ కుక్క ఎవరిదో అర్థం కాలేదు. దీంతో చివరికి వారి వివాదం తీర్చడానికి కుక్కకు డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని నిర్ణయించారు.

ఆ లాబ్రడార్ తనదేనంటూ చెబుతున్న షాదాబ్ ఖాన్.. దానిని ఎక్కడ కొన్నాడో పోలీసులకు చెప్పారు. అతడిచ్చిన ఆనవాలు మేరకు పచ్ మడీ ప్రాంతంలోని ఓ కుక్కలను అమ్మే వ్యక్తి వద్దకు వెళ్లారు. అక్కడ ఆ కుక్క తల్లిని సదరు విక్రయదారుడు చూపించడంతో దాని నుంచి డీఎన్‌ఏ తీసుకుని రెండింటినీ పరీక్షించారు. ఈ పరీక్షల్లో రెండు డీఎన్‌ఏలు ఒకటేనని తేలాయి. దీంతో ఆ కుక్కను పోలీసులు షాదాబ్‌కే అప్పగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్క విషయంలో నిజానిజాలను తేల్చి కుక్కను అసలైన యజమానికి అప్పగించడంపై నెటిజన్లు పోలీసులను అభినందిస్తున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x