Friday, November 1, 2024

మందుబాబులూ జాగ్రత్త.. మీ మంచికే.. కరోనా వచ్చిందో అంతే..

కరోనా ప్రస్తుతం దేశంలో ఏ స్థాయిలో విజృంభిస్తుందో వేరే చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా అధికారిక లెక్కల ప్రకారమే. ఇక లెక్కల్లో లేని వారు ఇంకెంత మందో. అయితే తాజాగా కరోనా వల్ల తీవ్ర ప్రభావానికి ఎలాంటి వారు గురవుతారో తెలియజేస్తూ శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సెకండ్ వేవ్ ప్రభావం రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై దారుణంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా మద్యపానం, ధూమపానం అధికంగా సేవించేవారికి కరోనా వస్తే కోలుకునే రేటు చాలా తక్కువని, వీరిలో చాలా వరకు ప్రాణాలు కోల్పోతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరిగిన వెబినార్‌లో అనేక ముఖ్య విషయాలపై నిపుణులు చర్చించారు. ఈ క్రమంలోనే రెండోదశ కొవిడ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు. అందులో ‘మద్యపానం, ధూమపానం చేసేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు ప్రస్తుత సెకండ్ వేవ్ కరోనా బారిన పడితే కోలుకోవడం కష్టమేన’ని హెచ్చరించారు.

ఇక చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ చేతన్‌ ముందాడ, శాస్వకోశ వ్యాధి నిపుణులు డాక్టర్‌ విశ్వేశ్వరన్‌ పాల్గొని సలహాలు అందించారు. మొదటిదశ కరోనా వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలున్న వారిపై ఎక్కువ ప్రభావం చూపించగా.. రెండోదశలో యువత, చిన్నారులు, గర్భిణులు సైతం దీని బారిన పడుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. ఆక్సిజన్‌ లెవల్‌ 94 కంటే తక్కువగా ఉంటేనే ఆక్సిజన్‌ అవసరం ఉంటుందని, అప్పటివరకు ఎలాంటి ఆందోళనా అవసరం లేదన్నారు. ప్రతి రోజూ బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌తో ఆక్సిజన్‌ స్థాయిని పెంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచించారు.

అంతేకాకుండా.. 18 సంవత్సరాలు పైబడిని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. ఒక డోస్‌ వ్యాక్సిన్‌ కరోనాను అడ్డుకోదని, మొదటి డోస్‌ తీసుకున్నాక రెండో డోస్‌ 4-8 వారాల్లో తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 18 సంవత్సరాల్లోపున్న చిన్నారులకు వ్యాక్సిన్‌ వద్దని, వీరికి వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x