Wednesday, January 22, 2025

తెలుగు అమ్మాయిలకు హోప్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. వకీల్ సాబ్ లోని జనగణ మన పాట లేజర్ షో తో కార్యక్రమం ప్రారంభమైంది. సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలోని మ్యూజికల్ షో అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు, దర్శకుడు జాగర్లమూడి క్రిష్, దర్శకుడు సురేందర్ రెడ్డి, దర్శకుడు హరీష్ శంకర్, దర్శకులు సాగర్ చంద్ర, మైత్రీ మూవీస్ నిర్మాత రవి శంకర్ నిర్మాత ఏఎం రత్నం, నిర్మాత బండ్ల గణేష్, ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ రామ్ తాళ్లూరి, సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత నాగ వంశీ, నాయికలు అంజలి, అనన్య నాగళ్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులను సత్కరించారు. వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, విద్యావేత్త పద్మావతి, తూప్రాన్ రైల్వే గేట్ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కాపాడిన సాహస బాలిక రుచిత సత్కారం పొందిన వారిలో ఉన్నారు.

ఈ కార్యక్రమంలో నాయిక అంజలి మాట్లాడుతూ..ఈ ఆడిటోరియం చూడటానికి నిండుగా బాగుంది. ఇంతమంది పవర్ స్టార్ అభిమానులను చూడటం సంతోషంగా ఉంది. వకీల్ సాబ్ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్ రాజు గారికి, దర్శకుడు శ్రీరామ్ వేణు గారికి థాంక్స్. కొన్ని క్యారెక్టర్స్ మన లైఫ్ లో గుర్తుండిపోతాయి. వకీల్ సాబ్ లో అలాంటి క్యారెక్టర్ చేశాను. వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడాలంటే పవన్ గారి గురించే మాట్లాడాలి. నా జీవితంలో గుర్తుండిపోయే సంఘటనల్లో పవర్ స్టార్ పవన్ గారితో కలిసి నటించడం ఒకటి. ఆయన మాతో మాట్లాడిన గొప్ప మాటలు మర్చిపోలేను. పవన్ గారు ఒక్కో సీన్ కు ప్రిపేర్ అయిన విధానం గురించి చెబితే టైమ్ సరిపోదు. ఇంతమంచి సినిమా, ఎక్సీపిరియన్స్ వకీల్ సాబ్ తో ఇచ్చినందుకు థాంక్స్ పవన్ గారు. దర్శకుడు వేణు గారికి, నా లక్కీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి థాంక్స్. ఆయన బ్యానర్ లో సీతమ్మ వాకిట్లో చిత్రంతో సీతగా పరిచయం చేశారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, థమన్ సంగీతం బ్యూటిఫుల్. మగువా మగువా సాంగ్ నా ఆల్ టైమ్ ఫేవరేట్ సాంగ్. వకీల్ సాబ్ కు ఒక కుటుంబంగా పనిచేశాం. 9న ఆడియెన్స్ సినిమా చూడబోతున్నారు. పవన్ గారిని మూడేళ్ల తర్వాత థియేటర్లో చూస్తున్నారు. వకీల్ సాబ్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు. సేఫ్ గా సినిమా చూడండి. అన్నారు.

నాయిక అనన్య నాగళ్ల మాట్లాడుతూ….ఈ కార్యక్రమంలో మాట్లాడాలని బాగా ప్రిపేర్ అయ్యాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏదీ గుర్తుకురావడం లేదు. నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. నాలాగా చాలా అమ్మాయిలు కలను నెరవేర్చుకునేందుకు ఇండస్ట్రీకి వస్తారు. ఇంట్లో వాళ్లు వద్దంటారు.ఇక్కడా రిజెక్షన్స్ వస్తాయి. తెలుగు అమ్మాయిలకు తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు రావు అని చెబుతుంటారు కానీ. వకీల్ సాబ్ సినిమా మాలాంటి తెలుగు అమ్మాయిలకు ఒక హోప్ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు గారికి థాంక్స్. దర్శకుడు శ్రీరామ్ వేణు గారు నన్ను తమ ఇంట్లో ఒక అమ్మాయిలా చూసుకున్నారు. బొమ్మరిల్లు సినిమా చూశాక ఇలాంటి ప్రొడక్షన్ లో ఎప్పుడు పనిచేస్తానా అనుకున్నాను. వకీల్ సాబ్ తో ఆ కోరిక నెరవేరింది. పీఎస్ వినోద్ గారి సినిమాటోగ్రఫీ మమ్మల్ని చాలా బాగా చూపించింది. అంజలి గారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సెట్ లో అంజలి గారు చాలా ఫన్ క్రియేట్ చేసేవారు. నివేదా ఇక్కడ లేకపోవడం బాధగా ఉంది. ఆమె నాకు చాలా సపోర్ట్ చేసింది. వకీల్ సాబ్ డిపార్ట్ మెంట్ అందరికీ థాంక్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించిన వకీల్ సాబ్ జర్నీని జీవితాంతం గుర్తుంచుకుంటాను. పవన్ గారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. షూటింగ్ టైమ్ లో ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. అన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x