Wednesday, January 22, 2025

‘మ‌హాస‌ముద్రం’ నుండి అదితిరావు హైదరి ఫ‌స్ట్‌లుక్

మొద‌టి చిత్రం ఆర్‌ఎక్స్ 100తో సూప‌ర్‌హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి తెర‌కెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మ‌హాస‌ముద్రం’. అదితిరావు హైద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ నుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుద‌ల ‌చేశారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్లో ఆమె పాత్ర పేరు మ‌హా అని తెలుస్తోంది. అలాగే లోతైన ఆలోచనలతో కన్నీళ్లతో క‌నిపిస్తున్న ఆమె లుక్ ఆక‌ట్టుకుంటోంది.

ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ప్ర‌స్టేజియ‌స్ గా తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీలో శ‌ర్వానంద్‌, సిద్దార్ద్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.

మ‌రో కీల‌క పాత్ర‌లో హీరోయిన్‌ అనూ ఇమాన్యుల్ న‌టిస్తోంది. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌, కొల్ల అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఆగ‌స్ట్‌19న మ‌హాస‌ముద్రం చిత్రాన్ని విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌.

తారాగ‌ణంః
శ‌ర్వానంద్‌, సిద్ధార్ద్‌, అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్

సాంకేతిక వ‌ర్గం:
‌ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
కో- ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌
బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: కిషోర్ గ‌రికిపాటి
సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్
సినిమాటోగ్ర‌ఫి: రాజ్‌తోట
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అవినాష్ కొల్లా
ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ కేఎల్‌
యాక్ష‌న్‌: వెంక‌ట్
పిఆర్ఓ: వంశీ- శేఖ‌ర్

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x