ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందే ఈ సారి నిబంధనలను కఠినంగా ఉంటాయని, అమలులో ఎలాంటి మినహాయింపులూ ఉండవని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఆయా ఫ్రాంచైజీలు, జట్టు కెప్టెన్, ఆటగాళ్లు దృష్టిలో పెట్టుకుని మెలగాలని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ భారీ షాకిచ్చింది. ఏకంగా రూ.12 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు తొలి తప్పు కనుక జరిమానాతో వదిలేస్తున్నామని, ఇకమీదట కూడా ఇది పునరావృతమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో మిగతా జట్లకు కూడా ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లైంది.
సాధారణంగా ఈ ఏడాది టోర్నీ నుంచి బీసీసీఐ తీసుకొచ్చిన నిబంధనల పరకారం 90 నిముషాల్లో ఓ ఇన్నింగ్స్ పూర్తి కావాలి. అందులో 5 నిముషాలు బ్రేక్ టైం తీసేయగా.. మిగతా 85 నిముషాల్లో బౌలింగ్ వేసే జట్టు 20 ఓవర్లు వేయాల్సిందే. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఏ జట్టుకైనా భారీ జరిమానా పడుతుంది. అలాగే ఏ జట్టైనా తొలిసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే కెప్టెన్‌ను జరిమానా.. ఆ తర్వాత కూడా అదే తప్పు చేస్తే.. ఆటగాళ్లకు కూడా జరిమానా విధించడంతో పాటు కెప్టెన్‌పై మ్యాచ్ నిషేధం కూడా విధించనుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే తొలిసారి తప్పు చేసిన ధోనీకి జరిమానాతో సరిపెట్టింది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్క్‌కేపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. 189 పరుగల లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలోనే ఛేదించి రికార్డు సృష్టించింది. ప్రధానంగా ఢిల్లీ ఓపెనర్లు పృధ్వీ షా(72), శిఖర్ ధవన్(85) విజృంభించి ఆడడంతో ఢిల్లీ జట్టు భారీ లక్ష్యన్ని సులభంగా ఛేదించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టుకు దారుణ ఓపెనింగ్ లభించింది. మిడిలార్డర్‌లో సురేశ్ రైనా(54), మోయీన్ అలీ(36) సంయమనంతో ఆడడం, చివర్లో శామ్ కర్రాన్(34)ధాటిగా ఆడడంతో చెన్నై 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్లు శిఖర్ ధవన్, పృధ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగడంతో వికెట్ కోల్పోయకుండా 137 పరుగులు చేసింది. ఆ తర్వాత పృధ్వీ షా అవుటైనా స్టోయినిస్, హెట్‌మెయిర్‌తో కలిసి ధావన్ విన్నింగ్స్ రన్స్ పూర్తి చేశాడు.