Friday, November 1, 2024

ఐపీఎల్ పూర్తి చేయాలని పట్టుదలగా బీసీసీఐ.. ఈసీబీని కన్విన్స్ చేస్తుందా..?

అత్యంత పటిష్ఠంగా బయోబబుల్‌ వాతావరణంలో ఐపీఎల్ 14వ సీజన్ నిర్వహిస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి ఆటగాళ్లకు సోకింది. దీంతో టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది. అనుకోకుండా ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడడం, మిగతా ఆటగాళ్లలో ఆందోళన నెలకొనడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన సీజన్‌ను ఎలాగైనా పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే తమ ప్రయత్నాలను తీవ్రంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగే 5 టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని… ఒక్కో టెస్టు షెడ్యూల్‌లో మార్పు చేసి కనీసం వారం ముందుగా సిరీస్‌ ముగించాలని ఇంగ్లండ్‌ బోర్డు (ఈసీబీ)కి విజ్ఞప్తి చేసింది. ఆగస్టు 4న మొదలయ్యే సిరీస్‌ సెప్టెంబర్‌ 14న ముగుస్తుంది. దీనిని కనీసం సెప్టెంబర్‌ 7 లోగా ముగించాలని ఈసీబీకి బీసీసీఐ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

అలా చేస్తే కనీసం 3 వారాల సమయం తమకు దొరుకుందని, అవసరమైతే రోజుకు 2 మ్యాచ్‌ల చొప్పున నిర్వహించైనా ఐపీఎల్‌లోని మిగిలిన 31 మ్యాచ్‌లను పూర్తి చేయవచ్చని భారత బోర్డు భావిస్తోంది. కానీ బీసీసీఐ ఆలోచన ఆచరణలో సాధ్యమయ్యేలా లేదు. 5 టెస్టులకు సంబంధించి ఆయా తేదీల ప్రకారం దాదాపు అన్ని టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. పైగా హోటల్‌ వసతి, బయో బబుల్, టీవీ ప్రసారపు ఏర్పాట్లు కొత్తగా చేయాల్సి రావడంతో పాటు ఈసీబీ తమ కౌంటీ జట్లను కూడా ఒప్పించాల్సి ఉంటుంది. అందువల్ల ఇది అసాధ్యమనే అనిపిస్తోంది. మరి దీనిపై బీసీసీఐ ఇంకెలాంటి ఆలోచన చేస్తుందో చూడాలి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x