భారత క్రికెట్ చరిత్రలో టీమిండియా తొలిసారి రెండు జట్లతో బరిలోకి దిగబోతోంది. ఈ క్రమంలోనే ఓ జట్టు కోహ్లీ సారథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ బయలుదేరబోతోంది. మరో జట్టు శ్రీలంకలో వన్డేలు, టీ20లు ఆడేందుకు రెడీ అవుతోంది. అయితే ఇంగ్లండ్ వెళ్లే జట్టుకు ఎప్పటిలానే విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండనున్నారు. ఇక రెండో జట్టుకు కెప్టెన్ ఎవరో తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ జట్ల కోచ్‌ల విషయంలో కూడా మొదటి నుంచి కొంత సందిగ్ధం నెలకొంది.
కోహ్లీ సేనకు ఎప్పటిలానే రవిశాస్త్రి కోచ్‌గా ఉండనుండగా.. రెండో జట్టుకు కోచ్ ఎవరనే విషయమే తేలలేదు. అయితే భారత్-ఏ, అండర్–19 జట్లకు కోచ్‌గా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌నే టీమిండియా-2కు కోచ్‌గా ఎంపిక చేయబోతున్నారని ఇప్పటివరకు కొన్ని వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. ద్రవిడ్‌ను తొలిసారి టీమిండియా సీనియర్ టీమ్‌కు కోచ్‌గా నియమించనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
వచ్చే జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ ఆటగాళ్లు, యువ ఆటగాళ్లు ఈ జట్టులో ఉంటారు. ఈ పర్యటన కోసం ద్రవిడ్.. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా తన పదవికి రాజీనామా చేశాడు. అలాగే కొన్నాళ్ల క్రితమే అండర్–19, టీమిండియా-ఏ బాధ్యతలనుంచి తప్పుకున్నాడు. శ్రీలంక పర్యటనకు భారత మాజీ పేసర్, యూత్ కోచ్ పారస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా వెళ్లే అవకాశం ఉంది. కాగా.. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు మ్యాచ్‌లలో శ్రీలంకతో తలపడనుంది.