Wednesday, January 22, 2025

గ్రేట్ బౌలర్స్: వీళ్లు ఒక్క నోబాల్ కూడా వేయలేదు.. తెలుసా..?

నోబాల్. క్రికెట్లో బౌలర్లను తెగ ఇబ్బంది పెట్టే అంశం ఇది. అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు సరిగ్గా గీతకు లోపలే కాలు వేయాలనే అంశం వారిని అనేకసార్లు ఇబ్బంది పెడుతుంది. దీంతో కొన్ని సార్లు గీత దాటేస్తుంటారు. నోబాల్ వేస్తుంటారు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు క్రికెట్లో రూల్స్ మరింత ఎక్కవ కావడంతో బౌలర్ నోబాల్ వేస్తే దానికి పెనాల్టీగా ప్రత్యర్థికి ఫ్రీహిట్ ఇవ్వడం జరుగుతోంది. అంటే తదుపరి బంతి కౌంట్ ఉండదు. దానిని బ్యాట్స్‌మెన్ ఎంత భారీ షాట్ అయినా బాదవచ్చు. క్యాచ్ పట్టినా నాటౌట్. ఇలాంటి నోబాల్స్ చాలాసార్లు మ్యాచ్‌ తీరునే తలకిందులు చేశాయి. ఎంతో బౌలర్లు ఈ నోబాల్‌ కారణంగా తమ కెరీర్లోనే పీడకలగా మిగిలే మ్యాచ్‌లు మిగుల్చుకున్నారు. అయితే తమ కెరీర్లో ఒక్క నోబాల్ కూడా వేయని బౌలర్లు కూడా ఉన్నారని మీకు తెలుసా..? అలాంటి క్రికెట్ లెజెండ్ల గురించి తెలుసుకోవాలంటే ఈ వార్త చదవండి.

ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు వెస్టిండీస్ లెజెండరీ స్పిన్నర్ లాన్స్ గిబ్స్. ఈ లెజెండ్ తన కెరీర్లో ఒక్క నోబాల్ కూడా వేయలేదు. స్పిన్ బౌలర్‌గా 79 టెస్టులు, 3 వన్డేలు ఆడిన గిబ్స్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 300 వికెట్ల మార్కును చేరుకున్న తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. అన్ని వికెట్లు తీసినా.. అంత సుదీర్ఘంగా ఆడినా.. ఇక్కసారి కూడా గిబ్స్ గీత దాటలేదు. నోబాల్ వేయలేదు. ఇక గిబ్స్ తరువాత క్రికెట్లో అత్యంత క్రమశిక్షణ గల ఫాస్ట్ బౌలర్ లిల్లీ. ఆస్ట్రేలియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ అయిన లిల్లీ కెరీర్లో ఒక్క నోబాల్ వేయలేదు. అంతర్జాతీయ కెరీర్‌లో 70 టెస్టులు, 63 వన్డే మ్యాచ్‌లు ఆడి, టెస్టుల్లో 355 వికెట్లు, వన్డేల్లో 103 వికెట్లు తీసుకున్నాడు. కానీ ఒక్కసారి కూడా గీత దాటలేదు. నోబాల్ వేయలేదు.

ఇక ఈ జాబితాలో తొలి ఆటగాడు, ఆల్ రౌండర్.. ఇంగ్లండ్‌కు చెందిన ఇయాన్ బోథం. ఇయాన్ తన 16 సంవత్సరాల క్రికెట్ కెరీర్‌లో ఒక్క నో బాల్ కూడా వేయలేదు. ఇంగ్లాండ్ తరఫున ఏకంగా 102 టెస్టులు, 116 వన్డేలు ఆడిన ఇయాన్.. టెస్టుల్లో 383 వికెట్లు, వన్డేల్లో 145 వికెట్లు తీశాడు. అయినా ఒక్క సారి నోబాల్ వేయలేదంటే అతడి బౌలింగ్‌కు జోహార్లు చెప్పాల్సిందే.

మన భారత దేశ త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ క్రికెట్ వేదికపై రెపరెపలాడించిన తొలి కెప్టెన్ కపిల్ దేవ్. ఆల్ రౌండర్‌గా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌ రెండింటితోనూ అదగొట్టి దేశానికి తొలి వన్డే వరల్డ్ కప్ అందించిన గొప్ప క్రికెటర్‌గా ఘనత దక్కించుకున్నాడు. కపిల్ కూడా తన కెరీర్లో ఒక్క నోబాల్ అయినా వేయలేదు. మొత్తం 131 టెస్టులు, 225 వన్డే మ్యాచ్‌లు ఆడిన కపిల్.. ఒక్కసారి కూడా గీత దాటలేదు. పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్, ఆదేశానికి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా కెరీర్ మొత్తంలో ఒక్క నోబాల్ అయినా వేయలేదు. ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లలో ఒకడైన ఇమ్రాన్.. తన కెరీర్లో 88 టెస్టులు, 175 వన్డే మ్యాచ్‌లు ఆడి, టెస్టుల్లో 362 వికెట్లు, వన్డేల్లో 182 వికెట్లు తీశాడు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x