Friday, November 1, 2024

డెల్టా వేరియంటే టాప్.. మరో 2 నెలల్లో..

కోవిడ్ వేరియంట్లన్నింటిలోకంటే డెల్టా వేరియంట్ వ్యాప్తి విపరీతంగా ఉందని, ఇప్పటికే 100 దేశాల్లో ఈ వేరియంట్ తన ప్రభావం చూపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పటివరకు చూసిన అన్ని వేరియంట్లలో ఇదే అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని, దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో రాబోయే రెండు నెలల్లో అత్యంత ప్రభావ వంతమైన వేరియంట్‌గా కూడా ఇది మారుతుందని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. డెల్టా వేరియంట్ వల్ల కరోనా పాజిటివిటీ రేటుతో పాటు, ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య కూడా పెరుగుతుందని, అందువల్లే ఈ వేరియంట్‌ను ప్రమాదకారిగా పేర్కొనడం జరుగుతోందని, వెల్లడించింది.

‘గత నెల 29 నాటికి మొత్తం 96 దేశాల్లో ఈ వేరియంట్ బయటపడింది. ఆయా దేశాల్లో వేలు, లక్షల మంది దీని బారిన పడ్డారు. కానీ ఇది అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఈ వేరియంట్ వ్యాప్తి చెందిన దేశాల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండవచ్చు. అనేక దేశాల్లో కరోనా వేరియంట్లను గుర్తించే సామర్థ్యం అంతంత మాత్రంగానే ఉండడం, అనేక దేశాల్లో కోవిడ్ నిబంధనలను గాలికొదిలేయడం వంటి కారణాల వల్లే ఈ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి తీరును గమనిస్తే మరో 2 నెల్లలో ఇది అత్యంత డామినెంట్ వేరియంట్‌గా మారుతుంది. కరోనా నియంత్రణ విషయంలో ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలు, అమలు చేస్తున్న చర్యలు డెల్టాతో సహా ఆందోళనకరమైన వేరియంట్ల(వీఓసీ) నియంత్రణకు సైతం ఉపయోగపడుతుంది. నియంత్రణ చర్యలను దీర్ఘకాలం కొనసాగించడం, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ ఆ దిశగా అడుగులు వేయాలి’ అని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.

నియంత్రణ చర్యలు పాటించకపోవడం వల్లే..
ఇప్పటివరకు గుర్తించిన కరోనా వేరియంట్లలో డెల్టా రకం వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌గా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అడానోమ్‌ ఘెబ్రెయెసుస్‌ గతవారమే ప్రకటించారు. కరోనా వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతున్న దేశాల్లో ఇది అమిత వేగంతో వ్యాప్తి చెందుతోందని చెప్పారు. ఈ పరిణామం పట్ల ప్రపంచ దేశాలతోపాటు తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కొన్ని దేశాలను కరోనా ఆంక్షలను సడలించాయని, నియంత్రణ చర్యలను గాలికొదిలేశాయని, దీనివల్లే ప్రమాదకర వేరియంట్లు పంజా విసురుతున్నాయని పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం.. అల్ఫా వేరియంట్‌ కేసులు 172 దేశాల్లో బయటపడ్డాయి. బీటా వేరియంట్‌ ఉనికి 120 దేశాల్లో వెలుగు చూసింది. ఇక గామా వేరియంట్‌ 72 దేశాల్లో, డెల్టా వేరియంట్‌ 96 దేశాల్లో వ్యాప్తి చెందుతున్నాయి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x