Friday, November 1, 2024

అల్లుడితో అత్త అక్రమ సంబంధం.. పారిపోయి పెళ్లి.. చివరికి..!

ఓ అత్త, ఓ అల్లుడు.. పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విచిత్ర ఘటన ఏదో పక్క పాశ్చాత్య దేశంలో జరిగిందని అనుకోకండి. మన దేశంలోనే.. అది కూడా ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఆ అత్తా, అల్లుడు వావి వరుసలు మరిచి వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. తమ బంధాన్ని ఎవరూ అంగీకరించకపోవడంతో ఏకంగా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లాలోని మధుభార్ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఆమె వయసు 50. అతడి వయసు 25. ఆమెకు అతడు స్వయానా అల్లుడు. కానీ వారిలోని కామం వారిద్దరి మధ్య వావి వరసలను చెరిపేసింది. ఇద్దరి మద్య వివాహేతర సంబంధం పెట్టుకునేలా చేసింది. అయితే వీరి సంబంధం గురించి తెలిసిన కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 10 నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

కాగా.. ఇన్ని నెలల తరువాత వీరిద్దరూ బుదవారం ఇంటికి చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులకు వివాహం జరిగిన విషయం తెలియజేశారు. తామిద్దరం కలిసి ఉండాలని అనుకుంటున్నట్టు ఇంట్లోని వాళ్లకు తేల్చి చెప్పారు. కానీ ఇందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే పెద్ద గొడవ జరిగింది. కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు.. అత్త, అల్లుడిని అరెస్టు చేశారు. ఈ విషయం కాస్తా గ్రామస్తులకు తెలియడంతో వారు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x