Wednesday, January 22, 2025

థియేట‌ర్ల‌కు మంచి రోజులు వ‌చ్చాయి: ద‌ర్శ‌కుడు మారుతి

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఏక్ మినీ కథ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్, SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, యూవీ సంస్ధ‌, SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా రాబోతుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్ తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. ఇటీవ‌లే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన ల‌భించింది, ఈ నేప‌థ్యంలోనే విడుద‌లైన క్యారెక్ట‌ర్ ఇంట్రో లుక్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. హైద‌రాబాద్ ట్రెడెంట్ హోట‌ల్ లో ఈ క్యారెక్ట‌ర్ లుక్ వీడియో రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హించారు, ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ తో పాటు ద‌ర్శ‌కుడు మారుతి, నిర్మాత‌లు విక్ర‌మ్, ఎస్ కే ఎన్, హీరో సంతోష్ శోభ‌న్, హీరోయిన్ మెహ్రీన్ త‌దిత‌ర న‌టీన‌ట‌లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా న‌టుడు అజ‌య్ ఘోష్ మాట్లాడుతూ: ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మంచి రోజులు వ‌చ్చాయి వంటి సినిమా రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. నేను ఈ సినిమాలో పోషించిన గుండు గోపాలం క్యారెక్ట‌ర్ నా నిజ జీవ‌తానికి చాలా ద‌గ్గ‌రగా ఉంటుంది. నాలానే భ‌యంతో బాధ‌ప‌డే చాలా మందికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ప్రేక్ష‌కులు అంద‌ర్ని న‌వ్విస్తూనే ఓ మంచి మెడిసిన్ లా ప‌ని చేసేలా ఈ సినిమా ద‌ర్శ‌కుడు మారుతిగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు. కుటుంబ‌స‌మేతంగా అంద‌రూ థియేట‌ర్స్ లో చూసి తీరాల్సిన చిత్రం మంచిరోజులు వ‌చ్చాయి అని అన్నారు

హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ: ఈ సినిమాను నేనే ఒప్పుకోడంతోనే నాకు మంచి రోజులు వ‌చ్చాయి, మారుతి గారితో మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయ‌డం చాలా ఆనందంగా ఉంది, హీరో సంతోష్ శోభ‌న్ న‌ట‌న‌కు నేనే పెద్ద ఫ్యాన్, హాయిగా న‌వ్వుతూనే మ‌నలో చాలా మంది లోలోప‌ల అనుభ‌విస్తున్న ఓ వింత రోగానికి మెడిసిన్ మాదిరిగా ఈ మంచి రోజులు సినిమా పనిచేస్తోంది, అంద‌రూ త‌ప్ప‌కుండా ఈ చిత్రాన్ని చూసి మమ‌ల్ని ఎంక‌రేజ్ చేస్తార‌ని న‌మ్ముతున్నాను అని అన్నారు

నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ: మంచి మిత్రులున్న ఎవ‌రికైనా మంచి రోజులు వ‌స్తాయి, బ‌న్నీ వాసు, విక్ర‌మ్, వంశీ, మార‌తి వంటి నా స్నేహితులు కార‌ణంగానే, అల్లు అర‌వింద్ గారి ఆశిస్సులతో నేను నిర్మాత‌ను అయ్యాను. మంచి రోజులు వ‌చ్చాయి సినిమా గురించి నా కంటే మారుతిగారే మాటాల్లోనే వింటే బాగుంటుంది, మ‌హానుభావుడు త‌రువాత మెహ్రీన్ తో క‌లిసి ప‌నిచేయ‌డం, రైజింగ్ హీరో సంతోష్ శోభ‌న్ తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. క‌రోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ గా జర్నిలిస్టుల్ని చేర్చాలి, ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా త‌మ వృత్తిని నిర్విరామంగా నిర్వహించిన మీడియా వారి అంద‌ర‌కీ నేను ప్ర‌త్యేక‌మైన కృతిజ్ఞ‌త‌లు తెలుపుతున్నాను

హీరో సంతోష్ శోభ‌న్ మాట్లాడుతూ..:
హిట్ సినిమాలు ఉంటాయి, ఫ్లాప్ సినిమాలు ఉంటాయి కానీ ముఖ్య‌మైన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. దర్శ‌కుడు మారుతిగారు ఈ మంచి రోజులు వ‌చ్చాయి చిత్రాన్ని ఓ ముఖ్య‌మైన సినిమాగా అంద‌రూ చూసి తీరాల్సిన చిత్రంగా మ‌లిచారు. ఇంత మంచి సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చినందుకు మారుతి గారికి నా ప్ర‌త్యేక‌మైన కృతజ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను. నాకుంటూ ఏమి లేని రోజుల్లో నా టాలెంట్ ని న‌మ్మి నిర్మాత‌లు వంశీగారు, విక్ర‌మ్ గారు న‌న్ను ప్రొత్స‌హించారు వారికి ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. అలానే ఈ సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చిన నిర్మాత ఎస్ కే ఎన్ గారికి, నా తోటి న‌టీన‌టులు అంద‌రికీ ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను. ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని థియేట‌ర్స్ లో చూసి మ‌మ‌ల్ని ప్రొత్స‌హిస్తార‌ని ఆశిస్తున్నాను

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ:
క‌రోనా నేప‌థ్యంలో చాలా మందిని మిస్ అయ్యాము. నా కుంటుంబ స‌భ్యులుగా భావించే బిఏరాజుగారు ఇప్పుడు మ‌నంద‌రి మ‌ధ్య లేక‌పోవ‌డం చాలా బాధాక‌రం, అలానే టీఎన్ఆర్ గారు ఇలా ఎంతో మందిని క‌రోనా ద్వారా కోల్పోవడం జ‌రిగింది. న‌వ్వు అనే విష‌యానికి దూరం అయిపోయి ఒక రక‌మైన భ‌యంలోకి వెళ్లిపోయాం. క‌రోనా రాక‌పోయినా భ‌యం అనే రోగాన్ని పెంచుకొని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘ‌ట‌ణ‌లు చూసి నా వంతు కృషిగా ఏదైనా చేయాలి అనే అలోచ‌న నుంచి పుట్టిన సినిమానే మంచి రోజ‌లు వ‌చ్చాయి. ఈ సినిమాను మెరుపు వేగంతో ముగించి థియేట‌ర్స్ లో విడుద‌ల చేయాల‌ని ల‌క్ష్యంతో మా యూనిట్ అంతా వ‌ర్క్ చేశాము, దీనికి స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి నా ప్ర‌త్యేక కృతజ్ఙ‌త‌లు తెలుపుకుంటున్నాను. థియేట‌ర్ లోనే ఈ సినిమాను విడుద‌ల చేస్తాము, ఎలాంటి భ‌యాలు లేకుండా ప్రేక్ష‌కులు కూడా థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఈ సినిమా చూస్తార‌ని అలాంటి మంచి రోజులు అతి త్వ‌ర‌లోనే వ‌స్తాయ‌ని ఆశిస్తున్నాను అని అన్నారు‌

నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా
టెక్నికల్ టీం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి
నిర్మాత: వి సెల్యూలాయిడ్, ఎస్‌కెఎన్
బ్యానర్స్: యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
సంగీతం: అనూప్ రూబెన్స్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x