Wednesday, January 22, 2025

రాజమండ్రిలో ‘‘శ్రీ లహరికృష్ణుని గీతామృతం’’ పాటల సీడీ విడుదల

తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాకు చెందిన మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో, భగవాన్ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి దివ్య సముఖమున 02, జనవరి 2022 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ‘‘శ్రీ లహరికృష్ణుని గీతామృతం’’ అను పాటల సీడీ విడుదల కార్యక్రమం రాజమహేంద్రవరం(రాజమండ్రి)లోని మంజీర కన్వెన్షన్ హోటల్‌లో జరిగినది. ఈ కార్యక్రమంలో తమిళనాడుకి చెందిన సీనియర్ అడ్వకేట్ ఎస్. మీనాక్షిసుందరం సీడీని విడుదల చేయగా.. మొదటి కాపీని గ్రాడ్యుయేట్స్ ఎం.ఎల్.సి ఇల్లా వెంకటేశ్వరరావు, రెండవ కాపీని డిప్యూటీ సూపర్నెండెంట్ ఆఫ్ జైల్ ఎస్. కమలాకర్ అందుకున్నారు. ‘‘శ్రీమద్భగవద్గీత’’ను ప్రస్తుత కాలములోని జనులందరికీ అర్థమయ్యేలా శ్రీదేవాశీర్ లారిగారు వివరించిన ‘అక్షయమైన యోగము యొక్క ఉపదేశము’ను పాటల రూపములో రచించి, ప్రజలందరికీ ఆధ్యాత్మిక జీవితమును గ్రహింపజేసేలా ఈ పాటల సీడీని శ్రీ సౌందర్యలహరి క్రియేషన్స్, మనుజ్యోతి ఇంటర్నేషనల్ వారు తయారు చేసి ఉన్నారు.

ఈ ఆధ్యాత్మిక సభకు ప్రొఫెసర్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశాఖపట్నంకు చెందిన వి. బాలమోహన్‌దాస్ అధ్యక్షత వహించగా.. కమాండెంట్ ఎ.పి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, విజయవాడకు చెందిన డాక్టర్. కొండేటి నరసింహారావు దంపతులు శంఖారావం పూరించారు. మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులు డి.పి. ఉపాజ్ ఎన్.లారి అతిధులకు ఆహ్వానం పలికారు. ఈ సీడీలోని పాటలకు సంబంధించిన వివరణను ప్రొడ్యూసర్ లియో పి.సి.లారిగారు వివరించారు. ఇంకా ఈ కార్యక్రమములో ప్రముఖ వ్యాఖ్యాత కేసరి చక్రవధానులు రెడ్డప్ప ధవేజి, కైండ్‌నెస్ సొసైటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ గట్టిం మాణిక్యాలరావు, పంచాయితీ రాజ్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.బి. వరప్రసాద్, అడ్వకేట్ ముప్పల సుబ్బారావు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఒ తాడి రామగుర్రెడ్డి, అడ్వకేట్ అడవికొలను వేణు గోపాల కృష్ణ, ప్రొఫెసర్ నరవా ప్రకాష్‌రావు, భగవద్గీత వర్షిణి కాజా రామకృష్ణలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x