Friday, November 1, 2024

‘సీతారామం’ నుండి ‘కానున్న కళ్యాణం’ పాట గ్రాండ్ లాంచ్

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతారామం’. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని థర్డ్ సింగల్ ‘కానున్న కళ్యాణం’ పాటని హైదరాబాద్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో జరిగిన ఈవెంట్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, తరుణ్ భాస్కర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ పాటకు వేదికపై దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని అలరించింది.

ఈ పాట మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ గా విన్న వెంటనే ఆకట్టుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది. అనురాగ్ కులకర్ణి, సిందూరి ఈ పాటని ఆలపించిన విధానం అద్భుతంగా వుంది. లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పదికాలాలు గుర్తుపెట్టుకునేలా వుంది.

♪♪కానున్న కళ్యాణం ఏమన్నది ?
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది ?
ప్రతి క్షణం మరో వరం
విడువని ముడి ఇది కదా
ముగింపు లేని గాధగా
తరముల పాటుగా తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా.. ♪♪

పాట పల్లవిలో వినిపించిన ఈ సాహిత్యం మనసుకి గొప్ప హాయిని నింపేలా అనిపించాయి. అద్భుతమైన లోకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట చాలా ఆహ్లాదకరంగా వుంది. ముఖ్యంగా దుల్కర్, మృణాల్ మ్యాజికల్ గా కనిపిస్తుంది.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో సర్ప్రైజ్ చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది.

స్వప్న సినిమా పతాకంపై అశ్వినిదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దృశ్య కావ్యంగా తెరకెక్కుతున్న ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు.

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. కానున్న కళ్యాణం లాంటి అందమైన పాట చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. కాశ్మీర్ మంచు, ట్రెడిషనల్ దుస్తులలో చాలా అందంగా చిత్రీకరించాం. మోస్ట్ రొమాంటిక్, విజువల్ వండర్ లాంటి సాంగ్ ఇది. ఇది నా ఫేవరేట్ సాంగ్. ఈ పాటని మీ సమక్షంలో విడుదల చేయడం ఆనందంగా వుంది. ఇంతమంది విద్యార్ధులని ఒక్క చోట చూడటం ఇదే మొదటిసారి. ఆగస్ట్ 5న అందరం థియేటర్ లో కలుద్దాం అన్నారు,

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘సీతా రామం’ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ. కానున్న కళ్యాణం నాకు ఎంతోఇష్టమైన పాట. ఈ పాటని చాలా గ్రాండ్ గా షూట్ చేశాం. సినిమా అద్భుతంగా వుంటుంది. ఆగస్ట్ 5న అందరూ థియేటర్ లో సినిమా చూడాలి అని కోరారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన పాత్ర చేస్తున్నా. దర్శకుడు హను గారు కాల్ చేసి.. సీతా రామా మధ్యలో నీవు హనుమంతుడివని చెప్పారు. ఆయన ఒకసారి కథ చెప్పిన తర్వాత మరో ఆలోచన లేకుండా ఈ సినిమా చేస్తున్నాని చెప్పా. హను అద్భుతమైన దర్శకుడు. సీతారామం అందమైన ప్రేమకథ. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రేమ కథ చూడలేదు. ఆగస్ట్ 5న అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి అని కోరారు.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ తదితరులు

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x