Tuesday, January 28, 2025

‘జిన్నా’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది

డైనమిక్ స్టార్ విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’ టీజర్ ను ఆగస్ట్ 25న విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది. బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన సన్నీలియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందించారు. ఈ చిత్రంలో హీరో విష్ణు మంచు స‌ర‌స‌న‌ సన్నీలియోన్, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన‌ మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న‘జిన్నా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో విష్ణుతో స‌న్నీ రీల్స్… విష్ణు, ఆయ‌న బృందంతో సన్నీ ఓ చమత్కారమైన రీల్స్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించారు. ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ ఈ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త‌న సంగీతంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఉర్రుత‌లూగించే అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x